కృష్ణా జిల్లా ఎ. కొండూరులోని అటవీ శాఖ సెక్షన్ గార్డు కుమారి.. అనిశా వలకు చిక్కారు. రెడ్డిగూడెం మండలం రుద్రవరం రైతు నుంచి రూ. 50 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. చీమలపాడు సమీపంలోని పెద్ద తండాలో మామిడి తోటకు ఆర్ఓఆర్ పట్టా ఇచ్చేందుకు.. ఆమె రూ. లక్ష డిమాండ్ చేసినట్లు రైతు తెలిపారు. అనిశా అధికారులు ఆ అధికారిణిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి:
ఆర్టీసీ డ్రైవరు నిర్లక్ష్యం.. సంస్థలో ఎక్కడా పనిచేయకుండా వేటు!