woman serving food to elder people: కృష్ణా జిల్లా పామర్రు మండలానికి చెందిన గొల్వేపల్లి గ్రామంలో చందోలు దీనా అనే మహిళ ఆదరణ లేని వారికి ఆహారం అందిస్తోంది. రోజుకు రెండుపూటల భోజనం అందించి.. గ్రామంలోని వృద్ధుల అకలి తీరుస్తోంది. దీనికోసం అమె జయ ఆశీర్వాదం మెమోరియల్ ట్రస్ట్‌ను ప్రారంభించింది. ఆమె అత్తమామలు వృద్ధాప్యంలో తినటానికి లేక అకలితో అలమటించారని.. అలాంటి బాధ ఎవరికి రాకుడదనే ఉద్దేశ్యంతో అమె ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. దీనా అంగన్వాడీ టీచర్‌గా పని చేసి.. పదవీవిరమణ పొందారు. మోకానిక్‌గా పని చేసే అమె భర్త గత రెండు సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు.
వృద్ధాప్యం మీద పడి ఎటువంటి తోడులేక.. అకలితో అలమటిస్తున్న వారి కడుపు నింపేందుకు సెప్టెంబరులో భోజనాన్ని అందిచటం ప్రారంభించారు. మొదట గ్రామంలోని వారి సహాయంతో 20 మందికి భోజన ఏర్పాట్లు చేశారు. రానురాను ఆ సంఖ్య పెరుగుతూ వచ్చింది. దాదాపు 30 మందికి చేరింది. వంట చేయాటానికి గ్యాస్ వినియోగానికి డబ్బులు లేక కట్టెల పొయ్యి మీదే వంట చేస్తున్నారు. వంట చేయాటానికి గ్రామంలోని మహిళలు ఆమెకు సహకారం అందిస్తున్నారు. దీంతో ఆమెకు కొంత తోడుగా ఉంటోంది.
ఇవే కాకుండా గ్రామంలోని కొందరు పెద్దలు ఆమెకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. అయినంపూడి వెంకట సీతామనోహర్ అనే వ్యక్తి వంటకోసం గ్యాస్ స్టౌను అందించారు. వేణు గోపాల్ అనే వ్యక్తి బియ్యాన్ని అందించారు. రాబోయే రోజుల్లో సహాయం పొందే వారి సంఖ్య పెరిగే అవకాశం ఉందని నిర్వహకురాలు దీనా అంటున్నారు. అంతేకాకుండా ఈ కార్యక్రమం ముందుకు సాగాలాంటే దీనాపై భారం పడకుండా దాతలు ముందుకు రావాల్సిన అవసరం ఉందని గ్రామస్థులు అంటున్నారు.
ఇవీ చదవండి: