రెండోదశ పంచాయతీ ఎన్నికల్లో కలిదిండి మండలం కోరుకల్లు గ్రామంలో సర్పంచి స్థానం మహిళకు రిజర్వు అయ్యింది. దీంతో బట్టు లీలాకనకదుర్గ సర్పంచి అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగింది. అప్పటికే ఆమె 9 నెలల గర్భిణి. అయినప్పటికీ కడుపులో బిడ్డనుమోస్తూ ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంది.
ఓటు వేసిన కాసేపటికే నొప్పులురావటంతో ఆమెను కైకలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. సర్పంచిగా పోటీచేసి ఓటు వేసిన రోజే బిడ్డ పుట్టడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఆమె వెల్లడించింది.
ఇవీ చూడండి...: పవన్ కల్యాణ్‌తో రేషన్ డీలర్స్ ఫెడరేషన్ ప్రతినిధులు భేటీ