కుటుంబ కలహాలతో వ్యక్తి మృతిచెందిన ఘటన కృష్ణా జిల్లా నూజివీడులో చోటుచేసుకుంది. పట్టణ పరిధిలోని పొట్టిశ్రీరాములు విగ్రహం సమీపంలో ఆటో వర్కర్కైన అమరావతి సురేష్ (42)అనే వ్యక్తి కొంతకాలంగా నివసిస్తున్నాడు. ఇంట్లో చోటుచేసుకున్న కుటుంబ కలహాలతో ఇంటి ఆవరణలోనే బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడి మరణంతో కుటుంబంలో విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీచూడండి.మెడికల్ సీటు వచ్చిందన్నారు... 9 లక్షలు కాజేశారు...