విజయవాడ రూరల్ మండలం కుందావారీ కండ్రికలో ప్రమాదవశాత్తు పాఠశాల బస్సు కింద పడి మూడేళ్ల బాలుడు మృతి చెందాడు. ఉదయం సోదరిని బస్సు ఎక్కించేందుకు గ్రామంలోని ప్రధాన కూడలికి తండ్రి వెళ్తుంటే బాలుడు వెంట వచ్చాడు. అక్క పాఠశాల బస్సు ఎక్కగానే తండ్రి చేయి విదిలించుకున్న బాలుడు... బస్సు కదిలే సమయంలో ముందుకు పరుగెత్తి చక్రాల కింద పడ్డాడు. తీవ్రంగా గాయపడిన చిన్నారి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. నున్న గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తండ్రి కళ్లెదుటే.. బాలుడి మృతి - school bus
కృష్ణా జిల్లా కుందావారీ కండ్రిగలో విషాద ఘటన చోటుచేసుకుంది. తన అక్క చదువుతున్న పాఠశాల బస్సు కింద పడి ఓ చిన్నారి మృతి చెందాడు. ఈ ఘటన బాలుడి తండ్రి కళ్లెదుటే జరిగింది.
విజయవాడ రూరల్ మండలం కుందావారీ కండ్రికలో ప్రమాదవశాత్తు పాఠశాల బస్సు కింద పడి మూడేళ్ల బాలుడు మృతి చెందాడు. ఉదయం సోదరిని బస్సు ఎక్కించేందుకు గ్రామంలోని ప్రధాన కూడలికి తండ్రి వెళ్తుంటే బాలుడు వెంట వచ్చాడు. అక్క పాఠశాల బస్సు ఎక్కగానే తండ్రి చేయి విదిలించుకున్న బాలుడు... బస్సు కదిలే సమయంలో ముందుకు పరుగెత్తి చక్రాల కింద పడ్డాడు. తీవ్రంగా గాయపడిన చిన్నారి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. నున్న గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Body:ఈటీవీ
Conclusion:ఈటీవీ