ETV Bharat / state

చాక్లెట్​ కొనిస్తానని తీసుకెళ్లి.. ఆరేళ్ల బాలుడిపై...! - krishna district latest news

చాక్లెట్​ కొనిస్తానని తీసుకెళ్లి.. ఆరేళ్ల బాలుడితో అమానుషంగా ప్రవర్తించాడో మానవ మృగం. దారుణంగా వ్యవహరించాడు. అత్యాచారం చేసి బాలుడి నోట్లో, వెనుక రాళ్లు కుక్కి వెళ్లాడు. కృష్ణా జిల్లా బ్రహీంపట్నం పీఎస్​ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Sexual assault on a boy
బాలుడిపై లైంగిక దాడి
author img

By

Published : Aug 23, 2021, 10:23 PM IST

కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో దారుణం జరిగింది. ఆరేళ్ల బాలుడిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో స్థానికంగా ఇంటి సమీపంలో ఓ బాలుడు ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఓ వ్యక్తి.. చాక్లెట్ ఇప్పిస్తానంటూ ఆ బాలుడిని పక్కకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం బాలుడు నోటిలో వెనుక భాగంలో రాళ్లు కుక్కి వెళ్లిపోయాడు. కొంతసేపటి తరువాత తేరుకున్న బాలుడు.. ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు విషయం చెప్పాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పీఎస్​లో సోమవారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటనతో బాలుడి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. మగ పిల్లలకు కూడా రక్షణ లేకుండా పోయిందని వాపోయారు. దారుణానికి పాల్పడి నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి..

wife killed husband : కుటుంబ కలహాలు.. క్షణికావేశంలో కఠిన నిర్ణయం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.