ETV Bharat / state

బాలుడి అపహరణ కేసు..48 గంటల్లోనే ఛేదించిన పోలీసులు - విజయవాడ డీసీపీ హర్షవర్ధన్ రాజు

8 నెలల బాలుడి కేసును 48 గంటల్లోపే ఛేదించామని విజయవాడ డీసీపీ హర్షవర్ధన్​ రాజు తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచనున్నట్లు వెల్లడించారు.

'48 గంటల్లోపే కేసును సుఖాంతం చేశాం'
author img

By

Published : Sep 21, 2019, 7:07 PM IST

Updated : Sep 21, 2019, 11:53 PM IST

బాలుడి అపహరణ కేసును..48 గంటల్లోనే ఛేదించిన పోలీసులు

కృష్ణా జిల్లా ఆత్కూరు వద్ద అపహరణకు గురైన 8 నెలల బాలుని కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ కేసును వివిధ కోణాల్లో దర్యాప్తు చేసి నిందితులను 48 గంటల్లోపు పట్టుకున్నట్లు విజయవాడ డీసీపీ హర్షవర్ధన్ రాజు వెల్లడించారు. డబ్బులు తిరిగి చెల్లించే క్రమంలో జరిగిన వాగ్వాదం బాలుడు అపహరణకు కారణమైందని ఆయన తెలిపారు. తమ బిడ్డను అపహరించారని సోను దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన ఆత్కూరు, గన్నవరం పోలీసులు త్వరితగతిన దర్యాప్తు ప్రారంభించారు. నిందితులు రాజస్థాన్ పారిపోయారని సమాచారం తెలుసుకున్న పోలీసులు..వారి కంటే ముందే విమానంలో రాజస్థాన్ చేరుకున్నారు. అక్కడి రాష్ట్ర పోలీసులను అప్రమత్తం చేశారు. తద్వారా వారి ఆచూకీ కనుగొన్నట్లు విజయవాడ డీసీపీ తెలిపారు. నిందితులను కోర్టు ముందు హాజరుపరచనున్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి :

ఎనిమిది నెలల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం

Intro:స్క్రిప్ట్ కరవు నేలపై వరుణుడు కరుణించాడు వాగు వంక ప్రవహించి చెరువులు కుంటలు నిండుకుండను తలపించేలా నీరు చేరింది చెరువులోని జలకళ చూసి చేను మడి సాగు చేసుకోవచ్చు అన్న ఆశలు కర్షక ల్లో మొలకెత్తాయి ఇంతలోనే అధికారుల నిర్లక్ష్యం చెరువులపై ఆవరించడంతో రైతుల ఆశలు అడియాసలయ్యాయి చెరువులు నిండాయి అన్న ఆనందం 24 గంటల లోపే ఆవిరైంది కడప జిల్లాలోని వర్షాభావ ప్రాంతమైన రాయచోటి లక్కిరెడ్డిపల్లె డివిజన్లలో మూడు రోజులుగా భారీ వర్షాలు సాయి చెరువులు కుంటలు లోకి వర్షపు నీరు భారీగా వచ్చి చేరింది వర్షాలు కురుస్తున్న సమయంలో అప్రమత్తంగా ఉండాల్సిన జలవనరుల శాఖ అధికారులు అటువైపు చూడకపోవడంతో బలహీనంగా ఉన్న చెరువు కట్టలు ఒక్కసారిగా తెరుచుకున్నాయి చెరువు లేక్ వచ్చేరు నీరంతా వృధాగా పోతూ ఉండటం చూసి రైతులు కంటతడి పెట్టుకున్నారు రాయచోటి మండలం sibyala గ్రామంలోని పెద్ద చెరువు కట్టకు గురువారం రెండు గండ్లు పడగా స్థానికులు అప్రమత్తమై నీటి పారుదల శాఖ అధికారులకు సమాచారం అందించారు వెంటనే అక్కడికి వెళ్ళిన అధికారులు చిన్నపాటి రెండు గండ్ల ను జెసిబి యంత్రాలతో పంపించారు తర్వాత చెరువులోకి ఎగువ నుంచి నీరు వచ్చి చేరుతున్న కట్టపై పర్యవేక్షణ లేకుండా వెళ్లిపోయారు దాంతో శనివారం తెల్లవారుజామున చెరువుకు భారీ గండి పడింది చెరువులోని నీరు అంతా దిగువకు వృధాగా వెళ్లి పోవడం చూసి గ్రామస్తులు అధికారుల దృష్టికి మరోమారు తీసుకొచ్చారు అయినా గండి పూడ్చేందుకు వీళ్లు లేకపోవడంతో నీటిని వృధాగా వదిలేయాల్సి వచ్చింది 400 ఎకరాల ఆయకట్టుకు సరిపడా నీరు చెరువులోని లో చేరిన కూడా కనిపించని పరిస్థితి దాపురించింది కడప జిల్లాలోని కలసపాడు సంబేపల్లి రాయచోటి మండలంలో సత్రం కుంట పాలెం కుంట గుండ్ల తూముకుంట పెండ్లిమర్రి చెరువులకు గండ్లు పడడంతో వచ్చిన వర్షపు నీరు వృధాగా వెళ్ళిపోయి ఆయకట్టు రైతులకు కడగండ్లు మిగిల్చాయి రాత్రి చెరువు వద్ద సిబ్బంది పర్యవేక్షణ కు ఉంచి రైతుల సహకారంతో సకాలంలో గండిని పుచ్చుకుంటే నీరు వెళ్లిపోయేది కాదని రైతులు ఆవేదన చెందుతున్నారు అధికారులకు నివేదిక పంపి సత్వరం దిగిన చెరువులకు మరమ్మతు పనులు చేపడతామని రాయచోటి నీటిపారుదల శాఖ డి ఈ ఈ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు

Body:బైట్ గంగిరెడ్డి చెరువు నీటి సంఘం అధ్యక్షుడు ఇతర ఆయకట్టు దారుల వాయిస్

Conclusion:బైట్ గంగిరెడ్డి చెరువు నీటి సంఘం అధ్యక్షుడు ఇతర ఆయకట్టు దారుల వాయిస్
Last Updated : Sep 21, 2019, 11:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.