ETV Bharat / state

ప్రధాన వార్తలు @ 7 PM

.

ప్రధాన వార్తలు @ 7 PM
ప్రధాన వార్తలు @ 7 PM
author img

By

Published : Apr 13, 2021, 7:01 PM IST

. కొనసాగుతున్న కొవిడ్ కల్లోలం: కొత్తగా 4,228 కేసులు.. 10 మరణాలు

రాష్ట్రంలో కొత్తగా 4,228 కొవిడ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు. మరో 1,483 బాధితులు కోలుకోగా.. 10 మరణాలు సంభవించినట్లు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

. సీఈసీని కలిసిన తెదేపా ఎంపీలు..రాళ్లదాడి ఘటనపై ఫిర్యాదు

తిరుపతి ఉప ఎన్నికలో కేంద్ర బలగాలతో పోలింగ్ జరపాలని తెదేపా ఎంపీలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని, హోంశాఖ కార్యదర్శిని కోరారు. చంద్రబాబు ప్రచార సభలో జరిగిన రాళ్ల దాడిపై ఫిర్యాదు చేసిన ఎంపీలు..పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సీఈసీకి వినతి పత్రం అందజేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

. రాళ్లదాడి ఘటనపై ఎలాంటి ఆధారాలు లభించలేదు: డీఐజీ

చంద్రబాబు బహిరంగ సభను అడ్డుకోవాలని రాళ్ల దాడి చేసినట్లు ఆధారాలు లభించలేదని అనంతపురం రేంజ్ డీఐజీ కాంతి రాణా టాటా స్పష్టం చేశారు. సీసీటీవీ ఫుటేజ్, ప్రత్యక్ష సాక్షులను పరిశీలించినా తమకు ఆధారాలు లభించలేదన్నారు. ఫిర్యాదు చేసిన తెదేపా నాయకులను ఆధారాలను సమర్పించాలని కోరామని..ఈ విషయమై చంద్రబాబుకి నోటీసు ఇచ్చామని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

. 'కరోనా కథ ముగియలేదు.. టీకా ఒక్కటే మార్గం కాదు'

ప్రపంచవ్యాప్తంగా 78 కోట్ల టీకాలు అందించినా.. కరోనా అంతరించడానికి ఇంకా చాలా సమయం ఉందన్నారు డబ్ల్యూహెచ్​ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్. వైరస్​ను అరికట్టడానికి టీకా ఒక్కటే మార్గం కాదని, ఇంకా చాలా సాధనాలు ఉన్నాయని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

. ఆ రెండు దేశాల మధ్య యుద్ధం తప్పదా?

క్రిమియా ప్రాంతంలో ఘర్షణల నేపథ్యంలో రష్యా- ఉక్రెయిన్​ మధ్య యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. సరిహద్దుల్లో రష్యా భారీ స్థాయిలో బలగాలను మోహరిస్తోంది. ఇందుకు పలు కారణాలను చెబుతోంది. అయితే ఈ పరిణామాలు ఇరు దేశాలకు మంచిది కావని ఉక్రెయిన్​ హెచ్చరిస్తోంది. పరిస్థితిని అదుపు చేసేందుకు దౌత్యపరంగా ప్రయత్నిస్తోంది​. కానీ రష్యా అందుకు సహకరించడం లేదని మండిపడుతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అని ప్రజలు భయపడుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

. ఏడేళ్ల తర్వాత టెస్టుకు సిద్ధమైన టీమ్​ఇండియా

భారత్ మహిళల ఇంగ్లాండ్​ పర్యటన తేదీలు ఖరారయ్యాయి. ఇందులో భాగంగా టెస్టు, తలో మూడు వన్డేలు, టీ20లు ఆడనున్నాయి ఇరుజట్లు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

. బంగాల్​ దంగల్​: నక్సల్​బరిపై భాజపా జెండా!

దేశ చరిత్రలో బంగాల్​ నక్సల్​బరికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. నాటి ఉద్యమంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది నక్సల్​బరి. ఆ తర్వాత ఆ ప్రాంతం నక్సల్స్​ చేతిలోకి వెళ్లింది. ఆ తర్వాత రాజకీయంగా.. వామపక్షాలు ఆధిపత్యం చెలాయించారు. కానీ ఇప్పుడు పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

. లోయలో పడ్డ కారు- ఐదుగురు దుర్మరణం

హిమాచల్​ ప్రదేశ్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు లోయలో పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సహా డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

. తేజ సజ్జా 'ఇష్క్'​ విడుదల తేదీ ఖరారు

తేజ సజ్జా, ప్రియా ప్రకాశ్​ వారియర్​ జంటగా నటించిన 'ఇష్క్' సినిమా విడుదల తేదీ ఖరారైంది. ఏప్రిల్​ 23న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

. 'పాప్​కార్న్​ సలాడ్'.. ఇదేం ఐడియా తల్లీ!

అమెరికాలో ప్రముఖ ఫుడ్​ బ్లాగర్​ మోలీ యేహ్​ చేసిన వంటకం బ్యాక్​ ఫైర్​ అయ్యింది. మోలీ ఎంతో ఎంజాయ్​ చేస్తూ చేసిన 'పాప్​కార్న్​ సలాడ్​'ను చూసి నెటిజన్లు విపరీతంగా ట్రోల్స్​ చేస్తున్నారు. అసలు పాప్​కార్న్​తో సలాడ్​ చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.