కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరానికి చెందిన ప్రేమ్ కుమార్, పద్మ దంపతులకు ఓ పాప జన్మించింది. అయితే... ఆ పాప బరువు 5.5 కేజీలు. బొద్దుగా ఉన్న ఆ పాపను చూసి అందరూ సంతోషించారు. ఆ తర్వాత పాప బరువు 5.5 కేజీలు అని చెప్పడంతో ఒకింత ఆందోళనకు గురయ్యారు. వైద్యులు వచ్చి తల్లీబిడ్డ క్షేమమని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. తల్లికి చక్కెర వ్యాధి ఉండటం వల్ల... ఆమె తీసుకున్న ఆహారం శిశువుకు చేరి అధిక బరువుతో పుట్టిందని పిల్లల వైద్య నిపుణుడు మాగంటి శ్రీనివాసరావు తెలిపారు.
ముద్దుగా బొద్దుగా ఉన్న ఆ పాపను చూసి అందరూ గారాం చేస్తుంటే... చూసి మురిసిపోవడమే ఆ తల్లిదండ్రుల వంతైంది!