కువైట్ నుంచి విజయవాడకు వచ్చి నూజివీడు ట్రిపుల్ ఐటీ క్వారంటైన్‌లో ఉన్న 144 మందిలో 56 మందికి కరోనా పాజిటివ్ లక్షణాలు కనిపించడంతో ప్రత్యేక వాహనాలలో వారిని విజయవాడ తరలిస్తున్నట్లు మండల తహసీల్దార్ ఎం. సురేష్ కుమార్ తెలిపారు. వీరిని ఈనెల 21వ తేదీన నూజివీడు ట్రిపుల్ ఐటీకి తీసుకువచ్చినట్లు చెప్పారు.
వీరికి సమయానికి అల్పాహారము, భోజనము ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. రెవెన్యూ శాఖ, వైద్య సిబ్బంది ప్రాణాలకు తెగించి సేవలు అందిస్తున్నారని చెప్పారు. రైతులు, ప్రజలు ఏ విధమైన సమస్యలు ఉన్నప్పటికీ కార్యాలయానికి రాకుండా, ఫోను ద్వారా కానీ, ఆన్లైన్ విధానంలో కానీ సమస్యలను పరిష్కరించుకునే విధంగా ముందడుగు వేయాలని సూచించారు.