21KG Elephant Yam in AP: నేటి ఉరుకుల పరుగుల ప్రపంచంలో ప్రతిదీ కలుషితం అవుతున్న సమయంలో.. ఆ రైతు వ్యవసాయం చేస్తూనే తన ఇంటి అవసరాల కోసం కూరగాయలు, ఆకు కూరలను పండిస్తున్నాడు. అందుకోసం ప్రకృతి సిద్ధమైన వనరులను ఉపయోగించుకుంటూ.. తన ఇంటి పెరట్లో కూరగాయలను పండిస్తున్నాడు. ఆ రైతు రెండేళ్ల క్రితం దుంప మెుక్కను నాటగా.. అది ఎకంగా 21 కిలోలు అయ్యింది. మాములుగా అయితే కంద దుంపలు 8 లేదా 10 కిలోలవరకు బరువుంటాయి. అయితే ఈ రైతు పండించిన కంద దుంప మాత్రం ఏకంగా 21 కేజీలు ఉండటంతో.. చూపరులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
కృష్ణాజిల్లా అవనిగడ్డ మండలంలోని పాతఎడ్లలంక గ్రామంలో ఇంటి పెరట్లో పెంచుకున్న కంద దుంప అబ్బురపరుస్తోంది. సాధారణంగా కంద దుంప 10కిలోల వరకు ఊరుతుంది. కోప్పనాతి అంకరాజు అనే రైతు తన పెరట్లో పెంచిన కంద మాత్రం 21 కేజీల వరకు ఉంది. ఈ కంద దుంపను చుసిన రైతులు ఇంత పెద్ద దుంప చూడలేదని అంటున్నారు. ఎలాంటి ఎరువులు, పురుగు మందులు వాడకుండా కేవలం కుళాయి దగ్గరలో కంద మెుక్కను పెంచాడు. అయితే గత ఏడాది తవ్వకపోవడం.. రెండో సంవత్సరం అవడంతో ఇంత సైజులో ఊరింది అంటున్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి వద్ద ఉన్న ఖాళీ స్థలంలో కూరగాయల మొక్కలు పెంచుకుంటే, డబ్బు ఆదా అవుతాయని.., క్రిమి సంహారక అవశేషాలు లేని తాజా కూరగాయలు దొరకడంతో పాటు ఇంటి ఆవరణం అంతా పచ్చగా ఉంటుందని రైతు అంటున్నాడు.
'నేను ప్రతి సంవత్సరం కూరగాయల మెుక్కలు నాటుతాను. అందులో భాగంగా కంద దుంప మెుక్కను నాటాను. ఈ మధ్య దాన్ని తవ్వి చూస్తే అది 21 కేజీల వరకు పెరిగింది. ఈ దుంపను చూసిన మేము ఆశ్చర్యపోయాం. మా ఇంటి చుట్టూ పక్కలవారు.. మా పక్క గ్రామాల ప్రజలు వచ్చి చూసి పోతున్నారు. మా ఇంటో పెంచుకునే ఆకు కూరలు, కూరగాయల మెుక్కలకు ఎలాంటి క్రిమి సంహారక మందులు వాడలేదు. కేవలం సహజ సిద్ధంగా పండిస్తున్నాను.'- కోప్పనాతి అంకరాజు, పాత ఎడ్లలంక గ్రామం
అంకరాజు ఈ దుంపను మార్కెట్కు తీసుకురాగా అక్కడున్న వారంతా చూసి ఆశ్చరం వ్యక్తం చేశారు. ఇంత పెద్ద దుంపను కొనడం ఇదే మెుదటిసారంటూ ఆ షాప్ యజమాని వెల్లడించారు.
ఇవీ చదవండి: