కృష్ణా జిల్లా గుడివాడలో దొంగ ఓట్లు వేస్తూ వైకాపా కార్యకర్తలు పట్టుబడ్డారు. ఆర్.సి.ఎం చర్చి 43వ బూత్‌లో వైకాపా కార్యకర్త వద్ద భారీగా ఓటర్ కార్డులు గుర్తించారు. వైకాపాకు చెందిన మహిళ వద్ద 200 ఓటర్ కార్డులు ఉండటంతో అధికారులు కంగుతిన్నారు. వైకాపాకు అనుకూలంగా ఉన్నవారికి వేరే వ్యక్తుల ఓటర్ కార్డులను ఆ మహిళ పంపిణీ చేస్తుంది. ఉదయం నుంచీ జరుగుతున్నా తెదేపా ఏజెంట్లు ఆలస్యంగా గుర్తించారు.
ఓటర్ కార్డులతో పట్టుబడిన మహిళకు వైకాపా ఏజెంట్లు మద్దతుగా నిలిచారు. తెదేపా అభ్యంతరంతో వైకాపా కార్యకర్తలు ఘర్షణకు దిగారు. ఇరువర్గాలకు డీఎస్పీ మహేశ్ సర్దిచెప్పారు. పోలీసులు 144 ఓటర్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఆర్వో ఆదేశాల మేరకు విచారించి చర్యలు తీసుకుంటామన్న డీఎస్పీ మహేష్ తెలిపారు.
ఇదీ చదవండి