Dr BR Ambedkar Konaseema: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమజిల్లా సఖినేటిపల్లి మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అంతర్వేదిలోని దేవాదాయ శాఖకు చెందిన దిరుసుమర్రు సత్రంలో జూదగాళ్లు రెచ్చిపోయారు. ఓ పక్క నరసింహుడి కల్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంటే ఆ కల్యాణానికి వచ్చిన భక్తులకు అన్న ప్రసాదాన్ని పెట్టాల్సిన సత్రాన్ని పేకాట శిబిరంగా మార్చేశారు.
కల్యాణం, ఉత్సవాల వద్ద భారీ బందోబస్తులో పోలీసులు ఉన్నారనే కనీస భయం లేకుండా దర్జాగా జూదం నిర్వహించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు శిబిరంపై దాడి చేయగా పేకాటరాయుళ్లు పారిపోయారు. అయితే సత్రం నిర్వహకులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి: