ETV Bharat / state

GV Harsha Kumar on Kodi Kathi victims 'జగన్.. నీకు మానవత్వం ఉంటే సాక్ష్యం చెప్పు'

Ex MP GV Harsha Kumar on Kodi Kathi Case: దళితుల ఓట్లతో గెలిచి.. దళితులపైనే కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌ అన్నారు. కోడి కత్తి నిందితుడు శ్రీనివాస్‌ కుటుంబ సభ్యులను హర్షకుమార్ పరామర్శించారు. జగన్‌ విజయం కోసం చేసిన చిన్న గాయానికి ఏళ్ల తరబడి జైల్లో శ్రీనివాస్‌ మగ్గిపోతున్నారన్నారు. లోతైన విచారణ జరిపించాలంటూ న్యాయస్థానాల్లో పిటిషన్ వేయడం చూస్తే అతని సైకో మనస్తత్వం అర్థమవుతుందన్నారు.

GV Harsha Kumar
జీవీ హర్ష కుమార్
author img

By

Published : May 13, 2023, 5:54 PM IST

Ex MP GV Harsha Kumar on Kodi Kathi Case: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం ఠాణేలంకలో నివాసం ఉంటున్న.. కోడి కత్తి కేసులో నిందితుడు శ్రీనివాస్ కుటుంబ సభ్యులను మాజీ ఎంపీ జీవీ హర్ష కుమార్ పరామర్శించారు. జగన్ మానవత్వం లేని మనిషి అని.. ఈ కేసు ద్వారా నిజమని తేలిందని అన్నారు.

మర్డర్లు చేసి డోర్ డెలివరీ చేసినవాళ్లు బాహాటంగానే బయట తిరుగుతున్నారని.. బాబాయ్ హత్య కేసులో ప్రధాన నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు బయట తిరుగుతున్నారని పేర్కొన్నారు. జగన్‌ మోహన్ రెడ్డి విజయం కోసం చేసిన ఓ చిన్న గాయానికి సంబంధించిన కేసులో ఏళ్ల తరబడి శ్రీనివాస్ జైల్లో మగ్గిపోతున్నాడని అన్నారు.

దళితుల ఓట్లతో గెలిచి.. దళితులపైనే కక్ష పూరితంగా జగన్ వ్యవహరిస్తున్నారని హర్షకుమార్ విమర్శించారు. లోతైన విచారణ జరిపించాలంటూ న్యాయస్థానాల్లో పిటిషన్ వేయడం చూస్తే అతని సైకో మనస్తత్వం అర్థమవుతుందన్నారు. దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ లోతైన విచారణ అవసరం లేదని చెబుతున్నా కోర్టుకు రాకుండా కాలయాపన చేస్తున్నారన్నారు.

జగన్ వస్తే రాష్ట్రానికి మంచి జరుగుతుందని భావించి తన అభిమాన నేతపై చేసిన దాడి.. జగన్​ను ముఖ్యమంత్రి అయ్యేలా చేసిందని తెలిపారు. తనను 41 రోజులపాటు జైల్లో ఉంచినప్పుడు ప్రతిరోజు.. శ్రీనివాస్​ కలిసేవాడని.. శ్రీనివాస్​కి ధైర్యం చెబుతూ ఉండేవాడినని హర్షకుమార్ అన్నారు. తనని కలిసినప్పుడు.. తన అమ్మ, నాన్నని చూడమని చెప్పాడని అన్నారు. కానీ తాను వస్తే రాజకీయం అవుతుందని ఇన్ని రోజులు రాలేదని పేర్కొన్నారు. జగన్ మానవత్వం లేని మనిషని విమర్శించారు.

ఎళ్లు గడుస్తున్నా శ్రీనివాస్ జైలు నుంచి మాత్రం బయట పడలేకపోయారన్నారు. దళితుల ఓట్లతో గెలిచి వారిపైనే తన ప్రతాపాన్ని చూపిస్తున్నారని.. ఇప్పటికైనా కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పి.. శ్రీనివాస్​ని విడిపించాలని హర్షకుమార్ కోరారు. శ్రీనివాస్​ చాలా మంచి వాడని.. ఎటువంటి దురుద్దేశం లేదని.. కేవలం జగన్ ముఖ్యమంత్రి అవ్వాలని మాత్రమే దాడి చేసినట్లు హర్షకుమార్ తెలిపారు.

"నిజంగా శ్రీనివాస్.. జగన్​కి మంచి చేయాలనే ఉద్దేశంతోనే అయిదేళ్లుగా ఇరుక్కుపోయాడు. మర్డర్లు చేసినోళ్లు.. 14 రోజుల్లో లేదంటే 40 రోజుల్లోనే విడుదల అయిపోతున్నాడు. అటువంటిది హత్యాయత్నం చేసిన కుర్రాడికి ఇన్ని రోజులు బెయిల్ ఇవ్వకపోవడానికి కారణం ఏమిటి. ఇదేమైనా న్యాయమా. ఈ ముసలి తల్లిదండ్రులకు కడుపుకోత పెట్టడం ఎంత వరకు న్యాయం. నిజంగా నీకు మానవత్వం ఉంటే జగన్.. సాక్ష్యం చెప్పి ఆ అబ్బాయి విడుదలకు సహకరించు. వేరే రాజకీయ పార్టీ నేతలు చేపించారు.. ఇంకా లోతుగా దర్యాప్తు చేయండి అని చెప్పడం చాలా సిగ్గు చేటు". - హర్ష కుమార్, మాజీ ఎంపీ

GV Harsha Kumar on Kodi Kathi Case: 'జగన్.. నీకు మానవత్వం ఉంటే సాక్ష్యం చెప్పు'

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.