ETV Bharat / state

Crop Holiday: పంట విరామంపై అధికారులను నిలదీసిన రైతులు

Crop Holiday in Konaseema: కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం అయినాపురంలో రైతులు పంట విరామం ప్రకటించిన నేపథ్యంలో వారితో చర్చలకు అధికారులు ఏర్పాటు చేసిన సమావేశం రసాభాసగా మారింది. ఈ సమావేశంలో రైతులు పలు సమస్యలపై నిలదీశారు.

farmers questions to officials on crop holiday at konaseema
పంట విరామంపై అధికారులను నిలదీసిన రైతులు
author img

By

Published : Jun 18, 2022, 7:11 AM IST

కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం అయినాపురంలో రైతులు పంట విరామం ప్రకటించిన నేపథ్యంలో వారితో చర్చలకు అధికారులు ఏర్పాటు చేసిన సమావేశం రసాభాసగా మారింది. సర్పంచి మోకా రామారావు అధ్యక్షతన డీసీసీబీ మాజీ డైరెక్టర్‌ పెయ్యల చిట్టిబాబు ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఈ సమావేశంలో రైతులు పలు సమస్యలపై నిలదీశారు.

మండల వ్యవసాయాధికారి ప్రశాంత్‌కుమార్‌ ఒక్కరే హాజరుకావడంతో మురుగు, పంట కాలువలకు సంబంధించి అధికారులు రాకుంటే.. డ్రెయిన్ల సమస్యల పరిష్కారానికి ఎవరు హామీ ఇస్తారని రైతులు ప్రశ్నించారు. సమన్వయ లోపంతో వారు రాలేదని చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగు చేపట్టాలని, ప్రభుత్వం పంట నష్టపరిహారం, బీమాలను సకాలంలో చెల్లించి ఆదుకుంటుందని చిట్టిబాబు రైతులను ఒప్పించే ప్రయత్నం చేశారు. పెట్టుబడికి, ప్రభుత్వం అందించే పరిహారానికి సంబంధం ఉండడం లేదని, సాగు ఎలా చేపట్టగలమని రైతులు ప్రశ్నించారు.

‘గతేడాది అయినాపురంలో మాత్రమే పంట విరామం ప్రకటించాం. అప్పట్లో మంత్రులు, ఉన్నతాధికారులు వచ్చి మురుగు కాలువల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి మరిచారు. రంగరాయకోడుకు అరకొరగా నిధులు మంజూరు చేసి కొంతదూరం పూడిక తీసి ఆ తర్వాత పనులు నిలిపేశారు. నక్కలకాలువ, ఇరుమండ డ్రెయిన్ల ఆధునికీకరణ ఊసేలేదు. ఈ సమస్యను పరిష్కరించకుండా సాగు చేపట్టమంటే ఎలాగా..’ అని వారు ప్రశ్నించారు.

ఇవీ చూడండి:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.