ETV Bharat / state

ప్రజలను బురదలో వదిలేసి.. సీఎం గాల్లో తిరుగుతున్నారు: చంద్రబాబు

author img

By

Published : Jul 22, 2022, 5:04 AM IST

వరద బాధితులను ఆదుకోవడంలో వైకాపా ప్రభుత్వం విఫలమైందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. కనీసం తాగునీరూ ఇవ్వలేకపోయారని విమర్శించారు. తాను వస్తున్నానని ఇప్పుడు  రెండేసి వేలు ఇచ్చారని అన్నారు. గురువారం పశ్చిమగోదావరి, కోనసీమ జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ప్రజలను బురదలో వదిలేసి ముఖ్యమంత్రి గాల్లో తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.

chandrababu-naidu-on-ysrcp-government
chandrababu-naidu-on-ysrcp-governmentchandrababu-naidu-on-ysrcp-government

Chandrababu On YCP Government: 'ప్రజలను బురదలో వదిలేసి ముఖ్యమంత్రి గాల్లో తిరుగుతున్నారు. రాష్ట్రంలో బాధ్యతాయుతమైన ప్రభుత్వం లేదు. వరద బాధితుల కష్టాలు నన్ను తీవ్రంగా బాధించాయి. సీఎం గాలిలో వచ్చి పైపైన తిరిగి వెళ్లిపోతే ప్రజల కష్టాలు ఎలా తెలుస్తాయి? నేను వస్తున్నానని ఇప్పుడు రూ.2,000 చొప్పున పంపిణీ చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం బాధితులకు రూ.10వేల చొప్పున ఇస్తోంది. ఈ ప్రభుత్వం ఎందుకు ఇవ్వదు?' అని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. గురువారం పశ్చిమగోదావరి, కోనసీమ జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఆచంట మండలం కోడేరు నుంచి గోదావరిలో పంటుపై ప్రయాణించి అయోధ్యలంకలో బాధితులను పరామర్శించారు. ప్రభుత్వ సహాయక చర్యలపై ఆరాతీశారు. ఇద్దరు బాధితుల ఇళ్లకు వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు. తమకు వంతెన నిర్మించాలని, తాగునీటి సమస్యను పరిష్కరించాలని బాధితులు కోరారు. తాము తాగుతున్న కలుషిత నీటిని ఆయనకు చూపించారు.

.

పశ్చిమగోదావరి జిల్లా పర్యటన అనంతరం వశిష్ఠ గోదావరి నదిలో ప్రయాణిస్తూ పంటులో కోనసీమ జిల్లాలోని రాజోలు మండలం సోంపల్లి పుష్కర ఘాట్‌ వద్దకు చేరుకున్నారు. రాత్రి 10 గంటలకు మానేపల్లి పల్లెపాలెం చేరుకుని.. వరదలో మృతిచెందిన కారాడి రామకృష్ణ, కడలి శ్రీను కుటుంబాలను పరామర్శించి, రూ.లక్ష చొప్పున సాయం అందించారు. బాధితుల కష్టాలు విని, భరోసా నింపిన చంద్రబాబు పలుచోట్ల ప్రసంగించారు.

.

సీడబ్ల్యూసీ హెచ్చరించినా.. లెక్కలేదు..
‘14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విపత్తుల్లో సత్వరం స్పందించి సహాయ చర్యలు అందించాను. ఈ ముఖ్యమంత్రిని సీడబ్ల్యూసీ హెచ్చరించినా ముందస్తు చర్యలు తీసుకోలేకపోయారు. ప్రజల్ని అప్రమత్తం చేయలేనప్పుడు సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థలు ఎందుకు? ప్రజల్ని బురదలో తోసేసి మీరు గాల్లో చక్కర్లు కొడతారా? బాధితులకు తగినన్ని పడవలు ఏర్పాటు చేయలేకపోయారంటేనే ప్రభుత్వ సన్నద్ధత అర్థమవుతోంది. లంకల్లో కనీసం తాగడానికి మంచినీరు ఇవ్వలేదు. రెండు రోజుల్లో ప్రభుత్వం మంచినీరు అందించకుంటే ఆ బాధ్యత తెదేపా తీసుకుంటుంది. మీరు తాగుతున్న నీళ్లే జగన్‌రెడ్డి తాగగలరా? రియల్‌ టైం వ్యవస్థను భ్రష్టు పట్టించారు. పోలవరం ప్రాజెక్టును నిర్వీర్యం చేశారు. గుత్తేదారులను మారిస్తే కష్టాలు వస్తాయని ఎందరు హెచ్చరించినా లెక్క చేయలేదు. మూడేళ్లుగా డయాఫ్రం వాల్‌ ఏమైందో చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు దిగువ కాఫర్‌ డ్యాం దెబ్బతిందంటున్నారు. రెండింటికీ ఈ ప్రభుత్వ వైఫల్యాలే కారణం.

.

రూ.10 వేలు ఎందుకు ఇవ్వలేరు?
ఇదే గోదావరి వరదల్లో బాధితులకు తెలంగాణ ప్రభుత్వం రూ.10వేల వంతున ఆర్థిక సాయం చేస్తోంది. వైకాపా ప్రభుత్వం రూ.2,000 ఇస్తే సర్వం కోల్పోయిన బాధితుల కష్టాలు తీరతాయా? అవీ నేను వస్తున్నానని ఇస్తున్నారు. ఈ డబ్బులు ఇళ్లలో చేరిన బురద కడుక్కోవడానికీ సరిపోవు. బాధ్యత లేని ఇలాంటి ప్రభుత్వ పాలనలో ఉండలేకే విలీన మండలాల ప్రజలు తమను తెలంగాణలో కలపాలని కోరుకుంటున్నారు. బాధితులను పట్టించుకోకపోగా నేనొస్తే సమస్యలు చెప్పొద్దని వాలంటీర్ల ద్వారా బెదిరించటం దుర్మార్గం. ఆహారం అందినట్లు చెప్పాలని.. లేకపోతే రేషన్‌ ఆపేస్తామన్నారని సాక్షాత్తు బాధితులే వాపోతున్నారు. బెదిరిస్తే రెండు రోజులు భయపడతారేమో, కానీ తిరగబడితే ఏం చేస్తారు? తమలపాకుల సాగుకు ఎకరాకు రూ.50వేలు, అరటికి రూ.30వేల వరకు పెట్టుబడి పెడతారు. వరదలకు లంకల్లోని ఉద్యాన పంటలు పూర్తిగా మునిగిపోయాయి. నష్టపోయిన ప్రతి రైతుకు రూ.50 వేల చొప్పున పరిహారం ఇవ్వాలి. ఇళ్లు, సామాన్లు కోల్పోయిన వారికి ఇళ్లు కట్టించడంతోపాటు రూ.10వేల పరిహారం ఇవ్వాలి.

కేంద్రం ముందు మాట్లాడే దమ్ముందా?..
‘2020లోనే పోలవరం పూర్తయి ఉంటే ఈ ముంపు వచ్చేదికాదు. నేను అధికారంలోకి వస్తూనే ముంపు బారిన పడే ఏడు మండలాలు ఏపీకి ఇస్తే తప్ప ప్రమాణం స్వీకారం చేయనని చెప్పాను. ప్రత్యేక ఆర్డినెన్సు ద్వారా వాటిని మనకిచ్చిన తర్వాతే ప్రమాణ స్వీకారం చేశాను. ఇప్పుడా పరిస్థితి ఉందా? కేంద్రం ముందు మాట్లాడే దమ్ముందా? స్వర్గాన్ని చూపిస్తానని చెప్పిన జగన్‌.. మూడేళ్లుగా నరకాన్ని చూపుతున్నారు. ఇళ్లు కట్టలేదు, పునరావాసం లేదు. రాష్ట్ర పరిస్థితి శ్రీలంకలా తయారైంది. అక్కడి ప్రజలు ప్రభుత్వాన్ని కొట్టినట్టే ఇక్కడా ఆ పరిస్థితి వస్తుంది’ అన్నారు.

.

చంద్రబాబు బసకు విద్యుత్తు బంద్‌
వరద ప్రాంతాల పర్యటనలో భాగంగా గురువారం రాత్రి పాలకొల్లులో చంద్రబాబు ఓ ఫంక్షన్‌ హాల్లో బస చేయనుండగా దానికి మధ్యాహ్నం 4 గంటలపాటు విద్యుత్తు సరఫరా నిలిచిపోవడం వివాదాస్పదమైంది. నిర్వహణ పనుల్లో భాగంగా కొద్దిసేపు సరఫరా నిలిపివేశామని అధికారులు చెబుతుండగా, కావాలనే ఇలా చేశారని తెదేపా శ్రేణులు ఆందోళనకు దిగడంతో సరఫరా పునరుద్ధరించారు.

తెదేపా నాయకులకు తప్పిన ప్రమాదం

.

తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు గురువారం గోదావరి వరద ప్రాంతాల పర్యటనలో భాగంగా సోంపల్లి రేవువద్ద గట్టుకు చేరుతుండగా పడవ ప్రమాదం చోటుచేసుకుంది. తొలుత చంద్రబాబు, కొంతమంది నేతలు పంటు లోంచి మర పడవలోకి చేరారు. అనంతరం ఆయనతో పాటు వచ్చిన తెదేపా నేతలు, మీడియా ప్రతినిధులు పంటు దిగేందుకు అమర్చిన చెక్కపైకి చేరడంతో దాని గొలుసులు తెగిపోయి ఒరిగిపోయింది. మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, పితాని సత్యనారాయణ, ఉండి ఎమ్మెల్యే రామరాజు, మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ, ఎమ్మెల్సీలు అంగర రామ్మోహన్‌రావు, శ్రీను, మంతెన సత్యనారాయణరాజు, భద్రతా సిబ్బంది, మీడియా ప్రతినిధులు నీటిలోకి జారిపోవడంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, మత్స్యకారులు లైఫ్‌ జాకెట్లు విసిరి సురక్షితంగా పడవలోకి చేర్చారు. గోదావరి ఒడ్డుకు సమీపంలోనే ఉండటం.. అక్కడ లోతు తక్కువగా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పిందనే చెప్పాలి.

.

భద్రతపై అంత నిర్లక్ష్యమా?: వర్ల రామయ్య
ప్రతిపక్ష నాయకుడిగా కేబినెట్‌ హోదా కలిగిన తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనకు ఏర్పాట్లు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన గురించి మూడురోజుల ముందే ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినా నిర్లక్ష్యం వహించిందని మండిపడ్డారు. చంద్రబాబు పర్యటనలో జరిగిన బోటు ప్రమాదం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. ‘జడ్‌ ప్లస్‌ సెక్యూరిటీ కలిగిన చంద్రబాబు పర్యటనకు ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఆయన అధికారంలో ఉన్నప్పుడు, అప్పటి ప్రతిపక్ష నేత జగన్‌రెడ్డి పాదయాత్రకు ఏ రకంగా బందోబస్తు ఏర్పాట్లు చేసిందీ ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఇలాంటివి మరోసారి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రమాదానికి కారకులైన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి’ అని ఆయన గురువారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి: పోలవరాన్ని రివర్స్‌గేర్‌లో వెనక్కి తీసుకెళ్తున్నారు: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.