ETV Bharat / state

కారులో చెలరేగిన మంటలు, తప్పిన ప్రాణాపాయం

author img

By

Published : Aug 17, 2022, 3:34 PM IST

Car fire కోనసీమ జిల్లాలో కారులో అగ్నికి ఆహుతైంది. కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో డ్రైవర్​ అప్రమత్తమై బయటకు రావడంతో ప్రాణాపాయం తప్పింది.

car
కారు దగ్ధం

Fire in Car: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం హౌసింగ్ బోర్డ్ కాలనీలో రోడ్డుపై వెళ్తున్న కారులోంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కారు దగ్ధమైంది. హౌసింగ్ బోర్డు కాలనీలో ఇంటి వద్ద మూడు నెలలుగా ఉంచిన కారును వాటర్ సర్వీసింగ్ చేసేందుకు యజమాని తీసుకెళ్తుండగా వెనుక నుంచి పొగలు వ్యాపించాయి. కారు వెనకవైపు ఉన్న ద్విచక్ర వాహనదారుడు గమనించి.. కారు నడుపుతున్న వ్యక్తిని అప్రమత్తం చేశారు. ఆయన కారు ఆపి హుటాహుటిన బయటకు దిగడంతో పెను ప్రమాదం తప్పింది. అనంతరం క్షణాల్లో కారు పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.