TDP Supporters During Protest in Kakinada: గత కొన్ని రోజులుగా వైసీపీ నేతల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండాపోయింది. అధికారంలో ఉన్నాం కదా ఎలాంటి పనులు చేసినా చెల్లుతుందనుకుంటున్నారు. తమకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కును రాష్ట్రప్రభుత్వం జీవోల పేరుతో హరిస్తే.. వైసీపీ నేతలు పరోక్షంగా హరిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆంక్షలు, నిర్బంధాల పేరుతో తమను తమ నాయకుడిని అడ్డుకోవాలని చూస్తున్నారని ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణల్లో వైసీపీ నేతలు టీడీపీ నేతలపై దాడి చేయడంతో కాకినాడ ప్రాంతంలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.
కాకినాడలో తెలుగుదేశం నాయకులపై వైసీపీ నేతలు దాడికి పాల్పడటంతో ఆ ప్రాంతలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. గొడారిగుంటలో అంబేడ్కర్ విగ్రహం వద్ద మాజీ ఎమ్మెల్యే కొండబాబు ఆధ్వర్యంలో తెదేపా నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కుప్పంలో చంద్రబాబు పర్యటనను పోలీసులు అడ్డుకోవడాన్ని వ్యతిరేకిస్తూ తక్షణమే పోలీసు యాక్ట్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అర్ధరాత్రి తెచ్చిన ఆంక్షల జీవో రద్దు చేయాలని నినాదాలు చేశారు. స్థానిక వైసీపీ నాయకుడు బల్లా సూరిబాబు టీడీపీ నేతలను అడ్డుకున్నారు. ఆ ప్రాంతంలో నిరసన చేయడానికి వీల్లేదంటూ.. టీడీపీ మాజీ కార్పొరేటర్ అప్పలకొండ చెంపపైన, పిడిగుద్దులు గుద్దారు. మరికొందరిపైనా దాడి చేశారు. వైసీపీ నాయకులు దాడి చేయడంతో టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: