Young Man Suicide due to YCP Leaders Fraud: అధికారం, అరాచకం రెండు కలగలిస్తే నేరగాళ్లు ఎలా పేట్రేగిపోతారనేదానికి.. బిహార్, ఉత్తర్‌ప్రదేశ్ లాంటి రాష్ట్రాలు ఉదాహరణగా ఉండేవి. వాటిని తలదన్నేలా గత నాలుగేళ్లుగా అధికారపార్టీయే ఆంధ్రప్రదేశ్‌లో అరాచకం సృష్టిస్తోంది. హత్యలు, హత్యాయత్నాలు, దాడులు, భూకబ్జాలు, అత్యాచారాలు, కిడ్నాప్‌లు, సెటిల్‌మెంట్లు, బెదిరింపులు, ఆత్మహత్యలకు పాల్పడేలా వేధింపులు.. ఇలా రాష్ట్రంలో ఏ నేరాల్లో చూసినా వైసీపీ నాయకులదే ప్రధానపాత్ర ఉంటోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని వారు రెచ్చిపోతున్నా తీరు ఏదో ఓ చోట ప్రతిరోజు వెలుగు చూస్తునే ఉన్నాయి. తాజాగా అధికార పార్టీ నేతల భూదాహానికి కాకినాడలో ఓ యువకుడు బలయ్యాడు.
YSRCP Attacks: నన్ను ఎమైనా అంటే నా అభిమానులకు బీపీ పెరుగుతుంది.. 'వైసీపీ దాడులపై' జగన్తీరు
YCP Land Grabs in Kakinada : కాకినాడలో ఓ యువకుడి ఆత్మహత్య తీవ్ర కలకలం రేపింది. వైసీపీ నేతల భూదాహం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. అశోక్ నగర్‌లోని నేతాజీ వీధికి చెందిన 32 ఏళ్ల నున్న శ్రీకిరణ్ రష్యాలో నాలుగేళ్ల పాటు వైద్య విద్య అభ్యసించారు. చదువు మధ్యలో ఆపేసి స్వస్థలం వచ్చారు. వీరికి కాకినాడ సమీపంలో వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమి వివాదంలో మనస్తాపానికి గురైన శ్రీకిరణ్.. శనివారం పురుగుల మందు తాగారు. గమనించిన స్థానికులు కాకినాడ జీజీహెచ్ కు తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు.
"భూమి విషయంలో స్థానిక వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు సోదరుడు, అనుచరుడు పెదబాబు.. నా కుమారుడిని మోసం చేశారు.. వివాదం పరిష్కారం కోసం వైసీపీ నేతలను ఆశ్రయిస్తే.. భూమి పత్రాలు తీసుకుని డబ్బు రాదని చెప్పారు." - శేషారత్నం, మృతుడి తల్లి
అరెస్టుల రాజ్యం అంతులేని అరాచకపర్వం - వైసీపీ ప్రభుత్వం ఏం చేద్దామనుకుంటోంది?
Srikiran Chaudhary Suicide Incident: వైసీపీ నేతల భూదాహమే యువ వైద్యుడిని బలి తీసుకుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. మాజీ మంత్రి కురసాల కన్నబాబు తమ్ముడు కల్యాణ్.. భూదందాలు, దౌర్జన్యాలు భరించలేక కాకినాడకు చెందిన యువ వైద్యుడు నున్న శ్రీకిరణ్ ఆత్మహత్యకు పాల్పడటం బాధాకరమన్నారు. శ్రీకిరణ్‌కి చెందిన ఐదు ఎకరాలు కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకుండా.. ఒరిజినల్ డాక్యుమెంట్లు తనవద్దే ఉంచుకుని కల్యాణ్ వేధిస్తుండటం వల్లే యువ డాక్టర్ బలవన్మరణానికి పాల్పడ్డాడని తెలిపారు.
పరాకాష్ఠకు వైసీపీ ప్రజాప్రతినిధుల అరాచకాలు.. కోట్లల్లో అక్రమ వసూళ్లు
ఇది కచ్చితంగా వైసీపీ భూ బకాసురులు చేసిన హత్యేనని లోకేశ్ ఆరోపించారు. శ్రీకిరణ్ మృతికి కారకులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రాణాలు తీసుకోవడం సమస్యకి పరిష్కారం కాదని, బాధితులంతా ఏకమై రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వైసీపీ దందాలు, కబ్జాలను ఎదురించాలన్నారు.
రక్షకులే భక్షకులై - వైసీపీ నాయకుల చేతిలో అన్యాక్రాంతమవుతున్న వక్ఫ్ భూములు