ETV Bharat / state

తెలంగాణ ఉప ఎన్నికపై ఉత్కంఠ..జరుగుతుందా?..జరగదా? - ఏపీ రాజకీయ వార్తలు

Telangana byelection 2023: సాధారణంగా ఏదైనా నియోజక వర్గంలో ఎమ్మెల్యే కానీ ఎంపీ రాజీనామా చేసినా.. మృతి చెందినా.. 6 నెలలు లోపు ఉప ఎన్నిక నిర్వహిస్తారు. 4 రోజులు క్రితం సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న చనిపోయారు. ఆ స్థానంలో ఉపఎన్నిక నిర్వహణపై ఉత్కంఠ నెలకోంది.

సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ ఉప ఎన్నికపై చర్చ

author img

By

Published : Feb 22, 2023, 2:10 PM IST

Telangana byelection 2023 : తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే సాయన్న మృతి చెందారు. అయితే ఆ నియోజక వర్గం ఖాళీ అయిన స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుందా? జరగదా? అన్న అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. రాజనీతిశాస్త్ర నిపుణుడు బీ కృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సాధారణంగా ఎంపీ కానీ ఎమ్మెల్యే చనిపోయినా లేదా రాజీనామా చేసినా ప్రజాప్రాతినిధ్య చట్టం 151 ఏ ప్రకారం 6 నెలల్లోపు ఆ నియోజక వర్గంలో ఉప ఎన్నిక నిర్వహించాలి. దీని ప్రకారం ఆగస్టు 20 లోపు ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంది.

శాసనసభ గడువు పూర్తి .. ఎన్నికలు కష్టం: మే నెల కంటే ముందే కంటోన్మెంట్‌ స్థానానికి ఉప ఎన్నిక రావాలి. కానీ, తెలంగాణ శాసనసభ గడువు ఈ ఏడాది డిసెంబరుతో పూర్తి అవుతుంది. అంటే గడువు మరో 10 నెలలే ఉంది. లోక్‌సభ కానీ అసెంబ్లీ గడువు సంవత్సరంలోపు ఉంటే కేంద్ర ప్రభుత్వంతో కేంద్ర ఎన్నికల సంఘం సంప్రదింపులు జరిపి.. ఎన్నికలు నిర్వహించడం కష్టమని ధ్రువీకరిస్తుంది.

తుది నిర్ణయం.. ఎన్నికల సంఘానిదే: ఇదే కారణంతో 2018లో మన రాష్ట్రానికి చెందిన 5 వైఎస్సార్​సీపీ ఎంపీలు రాజీనామా చేసినా.. కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నిక నిర్వహించలేదని కొంత మంది రాజకీయ పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. దీని ప్రకారం సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఉప ఎన్నిక జరగదని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల సంఘానిదే చివరి నిర్ణయమని బీ కృష్ణారెడ్డి తెలిపారు.

ఎమ్మెల్యే మృతి: సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే సాయన్న ఈ నెల 19 న చనిపోయారు. ఆయన కొంత కాలంగా గుండె, కిడ్నీ సమస్యలతో బాధపడుతూ.. 16 న యశోద హాస్పటల్​లో చేరారు. అక్కడ ఆయనను ఐసీయూలో ఉంచి వైద్యులు వైద్యం అందించారు. పరిస్థితి క్రిటికల్ అయినందున చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఎమ్మెల్యేని బతికించడానికి చాలా ప్రయత్నాలు చేశామని కార్డియాక్​ అరెస్ట్ రావడంతో గుండె పని తీరు ఆగిపోయిందని డాక్టర్లు వెల్లడించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.