వ్యక్తిగతంగా మంత్రి అనీల్ కుమార్ యాదవ్ ను కించపరుస్తూ, సామాజిక మాధ్యమాల్లో పోస్టింగ్ చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని, వైకాపా నాయకులు తెనాలి డీఎస్పీకి వినతి పత్రం అందజేశారు. వేమూరు నియోజకవర్గం తుళ్లూరు కు చెందిన సోమశేఖర్ చౌదరి ,మంత్రి అనీల్ కుమార్ ను నిందించడం సరైంది కాదని వైకాపా నేతలు అన్నారు. ఇలాంటి ఘటనలకు అవకాశం లేని విధంగా, సోమశేఖర్ పై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని వారు డీఎస్పీని కోరారు.
ఇదీ చూడండి