పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన గొప్ప నేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్. రాజశేఖర్ రెడ్డి అని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మస్తాన్వలి అన్నారు. గుంటూరు జిల్లా కార్యాలయంలో నిర్వహించిన వైఎస్సార్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి వైఎస్సార్ ఎనలేని కృషి చేశారని మస్తాన్వలి కొనియాడారు. వైఎస్సార్ మరణం తర్వాత రాష్ట్రంలో ధ్రుతరాష్ట్రుడి పాలన ప్రారంభమైందని విమర్శించారు. ప్రాంతీయ పార్టీలు రాష్ట్ర అభివృద్ధిని విస్మరించాయన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పథకాలనే పేర్లు మార్చి తమవిగా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వం ఇచ్చిన హామీలను పక్కనపెట్టి ప్రధాని మోదీ దగ్గర మోకరిల్లిందని మండిపడ్డారు. ఇప్పటికైనా మెరుగైన పాలన అందించాలని సూచించారు.
ఇవీ చదవండి...
'దళితులపై దాడుల నుంచి దృష్టి మరల్చేందుకే అంబేడ్కర్ విగ్రహ స్థాపన'