గుంటూరు జిల్లా రేపల్లె మున్సిపాలిటీలో వైకాపా గెలుపొందింది. రేపల్లెలో 28 వార్డులుండగా.. వైకాపా 25 స్థానాలు కైవసం చేసుకోగా... తెదేపా 2 వార్డుల్లో, ఇతరులు 1 వార్డులో విజయం సాధించారు.
పట్టణంలో మొత్తం 28 వార్డులుండగా.. నాలుగు వార్డులు (1, 2, 8, 12) వైకాపాకు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 24 వార్డుల్లో 21 వార్డుల్లో (3, 4, 5, 6, 7, 9, 10, 13,15,16, 17, 18, 19, 21, 22, 23, 24, 25, 26, 27, 28) వైకాపా విజయం సాధించింది. ఏకగ్రీవాలతో కలిపి 25 వార్డులను వైకాపా కైవసం చేసుకుంది. 11,14 వార్డుల్లో తెదేపా విజయం సాధించగా.. 20వ వార్డులో స్వతంత్ర అభ్యర్ధి గెలుపొందారు. రేపల్లె పుర పీఠాన్ని వైకాపా దక్కించుకోవటంతో అభ్యర్థులు, పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.
ఇదీ చదవండి: మున్సిపల్ రిజల్ట్: ఇప్పటి వరకూ.. ఎక్కడ ఏ పార్టీ గెలిచిందంటే..?