ETV Bharat / state

నిధులు మంజూరు చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు..: వైఎస్సార్​సీపీ నేత - Meruga Nagarjuna

Guntur District: ఐదేళ్ల కిందట తన భార్య సర్పంచ్‌గా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని.. వైఎస్సార్​సీపీ నేత మాణిక్యాలరావు ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్య రోజ్ మేరీ సర్పంచ్‌గా ఉన్నప్పుడు సిమెంట్ రోడ్లు వేయించామని.. ఆ పనులకు సంబంధించి సుమారు 25 లక్షలు రూపాయలు రాకుండా.. స్థానిక మంత్రి అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

Guntur District
Guntur District
author img

By

Published : Mar 9, 2023, 12:41 PM IST

నిధులు మంజూరు చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు.. వైసీపీ నేత

Guntur District: 5 సంవత్సరాల క్రితం తన భార్య సర్పంచ్​గా ఉన్నప్పుడు సిమెంట్ రోడ్లు వేసిన నిధులు.. ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు విడుదల చెయ్యలేదని గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం అమర్తలూరు మండలం మూల్పూరు గ్రామానికి చెందిన వైఎస్సార్​సీపీ నాయకుడు మాజీ సర్పంచ్ రోజ్ మేరీ భర్త మూల్పూరు మాణిక్యాలరావు ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా.. తెనాలిలో పాత ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ప్రైవేట్ ఫంక్షన్ హాల్​లో విలేకరుల సమావేశంలో మూల్పూరు మాణిక్యాలరావు మాట్లాడారు. కొన్ని రోజుల క్రితం నిధులు విడుదల చెయ్యలేదనే విషయంపై నేను నా గోడు చెప్పుకుంటూ ఒక వీడియో విడుదల చేశానని, దానికి తన నియోజకవర్గ మంత్రి మెరుగు నాగార్జున కనీసం స్పందించక పోగా ఇప్పటి వరకూ నిధులు విడుదల చెయ్యలేదని అన్నారు.

ఆ వీడియో విడుదల చేసిన దగ్గర నుంచి తనపై నిత్యం దాడులకు అక్రమ కేసులు పెట్టటానికి శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు నక్కా ఆనంద్ బాబు అండగా నిలబడటంతో స్వేచ్ఛగా గ్రామంలో తిరుగుతున్నా అని అన్నారు. దొరల కళ్లల్లో ఆనందం కోసం ఎమ్మెల్యే మెరుగు నాగార్జున దళితులను మోసం చేస్తున్నారని.. దొరలకు కొమ్ముకాస్తున్నారని అన్నారు. గతంలో అభివృద్ధి పనులు చేసిన నక్కా ఆనంద్ బాబుని కాదని మెరుగు నాగార్జునకి సపోర్ట్ చేసామని అన్నారు.. అలా చేసినందుకు తాము ఎంతో సిగ్గు పడుతున్నాము.. అప్పుడు చేసిన తప్పు ఇప్పుడు సరి చేసుకోవాలి అని అన్నారు. వేమూరు నియోజకవర్గం అభివృద్ధి జరిగింది అంటే అది కేవలం నక్కా ఆనంద్ బాబు వల్లే సాధ్యం అయింది అని అన్నారు. పనుల నిమిత్తం ఖర్చు చేసిన నిధులు తనకు వెంటనే విడుదల చెయ్యాలని.. లేని పక్షంలో ఏప్రిల్ 5 న అంబేద్కర్ విగ్రహం వద్ద ఆమరణ నిరహార దీక్ష చేస్తాను అని తెలిపారు.

మేము 2013 నుంచి 2018 వరకు నా భార్య మూల్పూరు సర్పంచ్​గా పనిచేసింది. అప్పుడు మేము సిమెంట్​ రోడ్లు వేశాము. దానికి సంబంధించి సుమారుగా 25 లక్షల రూపాయలు రావలసి ఉంది.. ఈ నిధులను మంజూరు చేయాలని కోరగా వారు ఏదో ఒక సాకు చూపి ఇవ్వడం లేదు. ఇంక నేను ఏమీ చేయలేక నా బాధలను ఒక వీడియో రూపంలో చెప్పుకున్నాను.. దానికి మెరుగ నాగార్జున నా మీద దాడులు చేయించి అక్రమంగా కేసులు పెట్టిస్తున్నారు. నేను చేసిన పనులకు సంబంధించి విడుదల చేయాలి, లేని పక్షంలో ఏప్రిల్ 5 న అంబేద్కర్ విగ్రహం వద్ద ఆమరణ నిరహార దీక్ష చేస్తాను - మాణిక్యాలరావు, మాజీ సర్పంచ్ భర్త

ఇవీ చదపండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.