హైదరాబాద్లోని సీబీఐ కోర్టులో వ్యక్తిగత హాజరు మినహాయింపుపై జగన్ వేసిన పిటిషన్ను యనమల తప్పుబట్టారు. హాజరు మినహాయింపును గతంలోనే సీబీఐ కోర్టు, హైకోర్టు తిరస్కరించాయని స్పష్టం చేశారు. కేసులను ప్రభావితం చేసే ప్రమాదం గతంలో కన్నా ఇప్పుడు రెట్టింపైందని పేర్కొన్నారు. హాజరు మినహాయింపును జగన్ కోరడంపై అనుమానాలు ఉన్నాయని యనమల రామకృష్ణుడు అన్నారు. కోర్టుకు హాజరైతే రూ.60 లక్షలు ఖర్చు అని జగన్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ప్రజాధనం వృథా వంకతో హాజరు నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు.
'ప్రజాధనం వృథా వంకతో.. జగన్ తప్పించుకోవాలని చూస్తున్నారు' - yanamala rama krishnudu comments on jagan court attendence
ప్రజాధనం వృథా అవుతుందన్న వంకతో జగన్ కోర్టులో వ్యక్తిగత హాజరు నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారని తెదేపా నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు.
హైదరాబాద్లోని సీబీఐ కోర్టులో వ్యక్తిగత హాజరు మినహాయింపుపై జగన్ వేసిన పిటిషన్ను యనమల తప్పుబట్టారు. హాజరు మినహాయింపును గతంలోనే సీబీఐ కోర్టు, హైకోర్టు తిరస్కరించాయని స్పష్టం చేశారు. కేసులను ప్రభావితం చేసే ప్రమాదం గతంలో కన్నా ఇప్పుడు రెట్టింపైందని పేర్కొన్నారు. హాజరు మినహాయింపును జగన్ కోరడంపై అనుమానాలు ఉన్నాయని యనమల రామకృష్ణుడు అన్నారు. కోర్టుకు హాజరైతే రూ.60 లక్షలు ఖర్చు అని జగన్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ప్రజాధనం వృథా వంకతో హాజరు నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు.
taza
Conclusion: