ETV Bharat / state

చిత్రంలో విచిత్రం: వైకాపా నేతల ఫ్లెక్సీలో 'ఎన్టీఆర్ అభివాదం'

గుంటూరు జిల్లాలో మార్కెట్ కమిటీల పాలకమండళ్ల ప్రమాణ స్వీకారం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఒక ఫ్లెక్సీపై వైకాపా నేతలకు అభినందనలు తెలుపుతూ ఓ పోలీసు తన ఫొటో వేసుకోగా... మరో ఫ్లెక్సీలో తెదేపా వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు చిత్రపటం దర్శనమిచ్చింది.

wondering flexies in sattenapalli guntur district
వైకాపా నేతల ప్రమాణోత్సవ ఫ్లెక్సీలో ఎన్టీఆర్ ఫొటో
author img

By

Published : Jul 6, 2020, 2:48 PM IST

గుంటూరు జిల్లాలో మార్కెట్ కమిటీల పాలకమండలి ప్రమాణ స్వీకారం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి. సత్తెనపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ప్రమాణస్వీకార వేడుకల్లో ఓ పోలీసు అధికారి అత్యుత్సాహం ప్రదర్శించారు. రాజుపాలెం స్టేషన్​లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్సై ఆదాం.. అధికార పార్టీ నేతలకు అభినందనలు తెలుపుతూ ఫ్లెక్సీ పెట్టారు. అందులో నేతలతో పాటు తన ఫొటో వేయించుకున్నారు. ఈ వ్యవహారంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మరో ఫ్లెక్సీపై ఎన్టీఆర్ ఫొటో

ముప్పాళ్ల మార్కెట్ కమిటీ ఛైర్మన్ ప్రమాణ వేడుకలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై తెదేపా వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు ఫొటో దర్శనమిచ్చింది. వైకాపాకు నాయకుడు కామినేని శ్రీనివాస చౌదరి ఈ ఫ్లెక్సీని ఏర్పాటుచేశారు. గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న కొందరు నాయకులు వైకాపాలోకి రావడంవల్లే ఇలాంటి పరిణామాలు జరుగుతున్నాయని అక్కడి నేతలు అభిప్రాయపడుతున్నారు.

ఇవీ చదవండి:

'కంపెనీలో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ప్రమాదం'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.