గుంటూరు జిల్లా వినుకొండ పట్టణ సీఐ చిన్న మల్లయ్య.. ఓ రాజకీయ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆ ప్రాంత మహిళలు ఆరోపించారు. ఎమ్మెల్యేకు తొత్తుగా వ్యవహరిస్తూ పంచాయతీని ఓ పార్టీకీ ఏకగ్రీవం చేయాలని బెదిరిస్తున్నారని అన్నారు.
తమతో అసభ్యంగా ప్రవర్తించారని వాపోయారు. దుర్మార్గాలకు పాల్పడుతున్న అతణ్ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా ఎన్నికల అధికారి కాంతిలాల్ దండేకు వినతి పత్రం అందించారు. సత్వరమే చర్యలు తీసుకోవాలన్నారు.
ఇదీ చదవండి:
ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ.. సర్పంచ్ అభ్యర్ధి మద్దతుదారుల ఆందోళన