గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన మోదుగుల పూర్ణచంద్రరావు గత నెల 23న హత్యకు గురయ్యాడు. విచారణ మెుదలుపెట్టిన పోలీసులకు నిజాలు తెలిశాయి. తవ్వుతుంటే.. అసలు విషయాలు బయటపడ్డాయి. పిడుగురాళ్లకు చెందిన నాగూర్‌బీ.. మెుదటి భర్తతో విడిపోయింది. షఫీ అనే మరో వ్యక్తిని వివాహం చేసుకుంది. గుంటూరులో కూలీ పనులు చేసుకుంటూ.. తన పిల్లలతో జీవిస్తోంది. పూర్ణచంద్రరావు అనే మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగించేది. ఈ విషయం తెలిసి నాగూర్బీకి ఆమె రెండో భర్త షఫీకి మధ్య గొడవలు మెుదలయ్యాయి. అప్పుడప్పుడూ నాగూర్బీకీ పూర్ణచంద్రరావు డబ్బులు కూడా పంపేవాడు. ఆమె ద్వారా పూర్ణచంద్రరావుకు మరో అమ్మాయికి పరిచయమయ్యాడు.
ఓ రోజు నాగూర్బీతో భర్త షఫీ.. గొడవ పెట్టుకున్నాడు. పూర్ణచంద్రరావును చంపాలని ప్లాన్ వేశారు. ప్రియుడిని పిలిపించాలని నాగూర్బీకి చెప్పాడు. ఆమె పూర్ణచంద్రరావుకి ఫొన్ చేసి.. డబ్బులు ఇస్తానని చెప్పి గుంటూరుకు రమ్మంది. అతడు ఆమెను నమ్మి వచ్చాడు. ముందుగా వేసిన పథకం ప్రకారం.. షఫీతోపాటు మరో నలుగురు పూర్ణచంద్రరావు గొంతుకు కేబుల్ వైర్, చున్నీ బిగించి చంపేశారు. అనంతరం మృతదేహాన్ని సంచిలో చుట్టి అనంతవరప్పాడు-బొంతపాడు డొంకరోడ్డు సమీపంలోని పంట కాల్వలో పడేశారు. అయితే ఆ సంచిలో నాగూర్‌బీ తన రెండో భర్త షఫీకి సంబంధించిన ఆధార్ కార్డును ఉంచింది. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. ఈ మేరకు వివరాలను గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి వివరించారు.
ఇదీ చదవండి: పబ్జీ ఆడిన తరువాత గుండె ఆగిపోయింది!