ETV Bharat / state

దారుణం: అప్పు తీర్చలేదని మహిళను కిరాతకంగా హత్య చేశారు! - దారుణం: అప్పు తీర్చలేదని అంతమెుందించారు !

తీసుకున్న అప్పు తిరిగి చెల్లించని కారణంగానే గుంటూరు జిల్లా చక్రాయపాలెంలో మహిళ హత్యకు గురైందని పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని తెలిపారు. అధిక వడ్డీ ఆశ.. కష్టపడకుండా డబ్బు సంపాదించాలనే దురాశ కారణంగానే ఒకరి హత్యతో పాటు ఇద్దరు కటకటాలపాలయ్యారని పేర్కొన్నారు.

దారుణం: అప్పు తీర్చలేదని అంతమెుందించారు !

author img

By

Published : Jun 15, 2020, 6:18 PM IST

గుంటూరు జిల్లా కొల్లిపర మండలం చక్రాయపాలెంలో జరిగిన మహిళ హత్య కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు. తీసుకున్న అప్పు తీర్చలేదనే కారణంగానే హత్య చేశారని పోలీసులు వెల్లడించారు. తెనాలి డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం... సామ్రాజ్యం అనే మహిళ స్థానికంగా చిట్టీల వ్యాపారం చేసేది.

అధిక వడ్డీకి ఆశపడిన నిందితుడు వీరయ్య... తనతో పాటు తన కూతురుకు చెందిన సుమారు రూ.70 లక్షలను సామ్రాజ్యనికి అప్పుగా ఇచ్చాడు. కొన్ని రోజులపాటు వడ్డీ సక్రమంగానే చెల్లించిన సామ్రాజ్యం... నోట్ల రద్దు కారణంగా తీవ్రంగా నష్టపోయింది. దీంతో వీరయ్యకు వ​డ్డీతో పాటు అసలు కూడా చెల్లించలేకపోయింది.

పగ పెంచుకొని.. పథకం రచించి

గ్రామంలో పెద్దమనుషుల పంచాయతీ పెట్టిన వీరయ్య తన డబ్బులు తిరిగివ్వాలని కోరాడు. తన వద్ద అంత డబ్బు లేదని సామ్రాజ్యం తెలపగా... సగమైనా అప్పు చెల్లించాలని గ్రామ పెద్దలు తీర్మానం చేశారు. పంచాయతీ ద్వారా తనకు న్యాయం జరగకపోవటంతో పాటు ఆర్థిక లావాదేవీల ద్వారా తన కూతురి కాపురంలో కలతలు వచ్చాయని వీరయ్య సామ్రాజ్యంపై పగ పెంచుకున్నాడు. ఎలాగైనా ఆమెను చంపాలని వీరయ్య పథకం రచించాడు. దానికి అతని భార్య నర్సమ్మ సహకారం కోరాడు.

కంట్లో కారం చల్లి ,రోకలి బండతో మోది...

ఓ శుభకార్యానికి వెళ్లివస్తున్న సామ్రాజ్యాన్ని చుట్టుముట్టిన భార్యభర్తలు ఆమె కళ్లల్లో కారం చల్లారు. అనంతరం వీరయ్య ఆమె వెనకవైపు నుంచి రోకలిబండతో మోదటంతో పాటు విచక్షణారహింతంగా కత్తితో దాడి చేశాడు. దీంతో సామ్రాజ్యం రక్తపుమడుగులో కొట్టుమిట్టాడుతూ.. ప్రాణాలొదిలింది. అనంతరం భార్యభర్తలిద్దరూ అక్కడినుంచి పరారయ్యారు.

కష్టపడకుండా డబ్బు సంపాదించాలనే దురాశతోనే సామ్రాజ్యం హత్యకు గురైందని... వీరయ్య దంపతులు కటకటాలపాలయ్యారని డీఎస్పీ వెల్లడించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా చిట్టీల వ్యాపారం చేయటం నేరమని అలా ఎవరైనా చేస్తున్నట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.