ETV Bharat / state

ఆటోను ఢీకొట్టిన బస్సు.. మహిళ మృతి, 10మందికి గాయాలు

ప్రార్థన కోసం మేరీమాత మందిరానికి ఆటోలో వెళ్తున్నవారిని బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందారు. ముగ్గురు చిన్నారులతో సహా 10మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం గణపవరం వద్ద జరిగింది.

women died
ఆటోను ఢీకొట్టిన బస్సు
author img

By

Published : Feb 14, 2021, 3:40 PM IST

గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం గణపవరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో పది మందికి గాయాలయ్యాయి. కోర్నేపాడు గ్రామం నుంచి సమీపంలోని కనపర్రు మేరీమాత మందిరానికి 11మందితో ఆటో బయలుదేరింది. గణపవరం వద్ద ఓ ఆర్టీసీ బస్సు, ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మేరీ మరియమ్మ(30) మృతిచెందారు. ముగ్గురు చిన్నారులతో సహా 10మందికి గాయాలయ్యాయి. తీవ్రగాయాపాలైన ఆరుగురిని గుంటూరు జీజీహెచ్​కి తరలించారు. మిగిలినవారికి చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: పల్లెపోరు ముగియగానే.. పురపాలక ఎన్నికలకు సన్నాహాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.