ETV Bharat / state

అనారోగ్య సమస్యలు తట్టుకోలేక.. వివాహిత ఆత్మహత్య - ANDHRAPRADESH NEWS

అనారోగ్య సమస్యల కారణంగా ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఎన్ని మందులు వాడినా ఉపయోగం లేకపోవడంతో ఆత్మహత్య చేసుంది. ఈ ఘటన గుంటూరు జిల్లా తెనాలిలో చోటు చేసుకుంది.

WOMAN SUICIDE
మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య ఆరోగ్య సమస్వలే కారణం
author img

By

Published : Aug 11, 2021, 8:40 AM IST

తెనాలిలోని కొత్తపేటకు చెందిన బిందుశ్రీ (40) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అనారోగ్య సమస్యల గురించి ఎప్పుడూ బాధపడేదని ఆమె భర్త కామేశ్వరరావు తెలిపారు. కొత్తపేటకు చెందిన బిందుశ్రీ, కామేశ్వరరావులకు 21 సంవత్సరాల క్రితం వివాహమైంది. భర్తకు ఫీడ్స్, భార్యకు థైరాయిడ్ సమస్యలు ఉండడంతో వైద్యుల సలహా మేరకు పిల్లలు వద్దు అనుకున్నారు.

ఆరోగ్య సమస్యల నుంచి బయటపడాలని బిందుశ్రీ చాలా ప్రయత్నాలు చేసింది. కొంతకాలంగా సామాజిక మాద్యమాల్లో, టీవిల్లో వచ్చే కార్యక్రమాలు చూస్తూ వారు చెప్పే ఆరోగ్య చిట్కాలు పాటిస్తూ వచ్చింది. చాల ఔషధాలను వాడి చూసింది ఫలితం కనిపించకపోవడంతో మనస్తాపానికి గురైంది.

భర్త ఊరికి వెళ్లగా...

అగ్రిగోల్డ్ బాండ్ల విషయమై సోమవారం భర్త కామేశ్వరరావు పిడుగురాళ్లలోని అత్తగారింటికి వెళ్లాడు. రాత్రి 10:30కు ఇంటికి తిరిగి వచ్చి ఎంతసేపు పిలిచినా భార్య పలకలేదు. తలుపు ఎంతసేపు తట్టిన తీయకపోవడంతో అనుమానం వచ్చి తలుపు పగలకొట్టి చూడగా భార్య ఉరి వేసుకుని ఉంది.

విగతజీవిగా మారిన భార్యను చూసి కామేశ్వరరావు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు. అనారోగ్య సమస్యల వల్లే బిందుశ్రీ ఆత్మహత్య చేసుకుందని భర్త చెప్పాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి: చట్టసభల్లో నేరస్థులు-ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.