కొవిడ్ రోగులపై యాంటీబాడీస్ కాక్ టెయిల్ మందు వేగంగా పని చేస్తుందని గుంటూరుకు చెందిన వైరాలజిస్ట్ డాక్టర్ కళ్యాణ చక్రవర్తి అన్నారు. యాంటిబాడీలు నేరుగా రోగి శరీరంలోకి ప్రవేశపెట్టడం ద్వారా త్వరగా కోలుకున్నట్లు తమ పరిశీలనలో వెల్లడైందని తెలిపారు. అమెరికా నుంచి రెండు రోజుల క్రితమే మన దేశంలోకి వచ్చిన మందుని ఇంకా విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. రీ జెనరాన్ పేరిట తయారైన మందు వాడితే కరోనా రోగులు ఒకటి, రెండు రోజులకు మించి ఆసుపత్రిలో ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుత ఆసుపత్రి ఖర్చులతో పోలిస్తే మందు ఖరీదు తక్కువేనంటున్నారు కళ్యాణచక్రవర్తి.
ఇదీ చదవండీ.. Etv Bharat Effect: పదేళ్లుగా తీరని సమస్యకు పరిష్కారం