ETV Bharat / state

ప్రైవేటు ఆస్పత్రిలో విజిలెన్స్​ అధికారుల తనిఖీలు

గుంటూరు జిల్లా నరసరావుపేటలోని అంజిరెడ్డి ఆస్పత్రిలో విజిలెన్స్​ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కొవిడ్​ చికిత్సకు అధిక రుసుము వసూలు చేస్తున్నారని బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు సేకరించినట్లు అధికారులు తెలిపారు.

vigilance raids
విజిలెన్స్​ అధికారుల తనిఖీలు
author img

By

Published : May 13, 2021, 11:43 PM IST

గుంటూరు జిల్లా నరసరావుపేటలోని అంజిరెడ్డి ఆస్పత్రిలో విజిలెన్స్​ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కొవిడ్​ సోకిన వ్యక్తి నుంచి ఐదు రోజుల వైద్యానికి రూ. 3.38 లక్షలు వసూలు చేసినట్లు ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అధికారులు వివరాలు సేకరించారు. కరోనా చికిత్సతో పాటు రెమిడెసివిర్​ ఇంజక్షన్​ కోసం అదనంగా రుసుము వసూలు చేసినట్లు విజిలెన్సు ఎస్పీ జాషువా వెల్లడించారు. పిడుగురాళ్లలో ఉన్న ఇదే ఆస్పత్రి బ్రాంచిలో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు ఈ నెల 5న కేసు నమోదు కాగా.. అనుమతి లేకుండా నరసరావుపేటలోనూ కొవిడ్ రోగులకు చికిత్స అందిస్తున్నట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఇంతవరకు ఈ ఆస్పత్రిలో 32 మంది రోగులకు వైద్యచికిత్సలు అందించగా.. ఓ రోగి మృతి చెందినట్లు చెప్పారు. సంబంధిత శాఖాధికారులకు సమాచారం అందించి… తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఇదీ చదవండి: అదుపుతప్పి కాల్వలో పడిన లారీ.. ఇద్దరు కూలీలు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.