ETV Bharat / state

కొత్త ఇంటిని నిర్మాణంపై దంపతుల మధ్య గొడవ - భర్తను చంపిన భార్య - WIFE KILLED HUSBAND IN NAGARKURNOOL

భర్తను గొడ్డలితో నరికి విచక్షణారహితంగా చంపిన భార్య - నాగర్​కర్నూల్ జిల్లాలో దారుణం- కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు

Wife Killed Husband in Nagarkurnool
Wife Killed Husband in Nagarkurnool (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 24, 2024, 2:16 PM IST

Wife Killed Husband in Nagarkurnool : మానవత్వానికే మాయని మచ్చతెచ్చే ఘటన నాగర్​కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. తాళి కట్టిన భర్తను గొడ్డలితో విచక్షణారహితంగా చంపింది ఓ భార్య. మృతుని బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తెలకపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నాగర్​కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం వట్టిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య(50), ఎల్లమ్మ భార్యాభర్తలు. ఊర్లోనే ఉంటూ కూలీనాలీ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య అభిప్రాయబేధాలు ఏర్పడ్డాయి. గత కొంత కాలంగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి భోజనం చేసి నిద్రించారు ఈశ్వరయ్య.

గొడ్డలితో నరికి దారుణహత్య : అయితే శనివారం మధ్యాహ్నాం 12 గంటలు దాటినప్పటికీ ఇంటితలుపులు తెరవకపోవడంతో చుట్టుపక్కల వారికి అనుమానం వచ్చి గ్రామ పెద్దలకు సమాచారమిచ్చారు. గ్రామస్తులు ఇంటి తలుపులు తెరిచి రక్తపు మడుగులో పడున్న ఈశ్వరయ్య మృతదేహాన్ని చూసి అక్కడ ఉన్నవారు షాక్ అయ్యారు. వెెెెెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

ఈశ్వరయ్యను అతని భార్య గొడ్డలితో నరికి హత్య చేసినట్లుగా మృతుని బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్ట్​మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్యతో పాటు అల్లుడు, కుమార్తెలు పరారీలో ఉండడంతో పోలీసులు ఆ కోణంలో విచారణ జరుపుతున్నారు.

నాగర్​కర్నూల్ జిల్లాలో భర్తను చంపిన భార్య (ETV Bharat)

"ఈశ్వరయ్యను(56)భార్య, బావమరిది,పెద్దకుమార్తె, పెద్ద అల్లుడు, మరదలు కలిసి విచక్షణారహితంగా గొడ్డలితో తలపై నరికి చంపారు. మృతునికి సర్వే నంబర్ 300లో 2 ఎకరాల 14 గుంటల భూమి ఉంది. ఈ భూమిని ఇతరులకు అమ్మి ఆ డబ్బుతో తనకున్న పురిళ్లును తొలగించి కొత్త ఇంటిని నిర్మించాలని,పెళ్లీడుకు వచ్చిన ముగ్గురు కుమార్తెలకు వివాహం చేయాలనుకున్నాడు. ఇందుకు భార్య, బావమరిది అంగీకరించకుండా తమ మాట వినట్లేదు అనే ఉద్దేశంతో పెద్ద కుమార్తె,పెద్ద అల్లుడు, మరదలితో కలిసి విచక్షణారహితంగా ఈశ్వరయ్యను చంపారు. మృతుని చెల్లెలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాం"- కనకయ్య గౌడ్, నాగర్ కర్నూల్ సీఐ

వివాహేతర సంబంధం - భర్తను రోకలిబండతో కొట్టి హత్య చేసిన భార్య

వైఎస్సార్ జిల్లాలో దారుణం - ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య - WIFE KILLED HER HUSBAND Siddavatam

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.