అమరావతిపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) కమిటీ.. తప్పుడు నివేదిక ఇచ్చిందని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీనియర్ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్.... కృష్ణా కరకట్ట దిగువన ఐదు కిలోమీటర్ల ప్రాంతంలో మద్రాస్ ఐఐటీతో భూసార పరీక్షలు నిర్వహించినట్లు బీసీజీ తన నివేదికలో పేర్కొన్నారని తెలిపారు. విజయకుమార్ వ్యాఖ్యలపై ఓ వ్యక్తి మద్రాస్ ఐఐటీని సంప్రదించగా ఎలాంటి భూసార పరీక్షలు నిర్వహించలేదని మెయిల్ ద్వారా తెలిపారని చెప్పారు. ఈ వ్యవహారంలో కేసు నమోదు చేయాలని మంగళగిరి గ్రామీణ పోలీసులను కోరారు.
ఇవీ చదవండి: