ఇసుక కొరతపై మరోసారి ఆందోళనకు తెదేపా సిద్ధమని వర్ల రామయ్య అన్నారు. ఈనెల 24న రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతామని తెలిపారు. భవన నిర్మాణ కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. తెదేపా నేతలు సామూహిక నిరాహార దీక్షలు చేస్తారనీ.. తమ వెంట వచ్చే పార్టీలు, ప్రజాసంఘాలతో కలిసి ఆందోళన చేపడతామని వివరించారు. సీఎం జగన్ సీబీఐనీ బెదిరిస్తున్నారని ఆరోపించారు.
ఇవీ చదవండి.
జగన్ కంటే.. వైఎస్ఆర్ వెయ్యి రెట్లు నయం: చంద్రబాబు