గుంటూరు జిల్లా నూజెండ్ల మండలంలో ఉపాధి హామీ పథకంలో జరిగిన అక్రమాలపై కలెక్టర్ కోన శశిధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడుగురు గ్రామీణ ఉపాధి హామీ సిబ్బందిని విధుల నుంచి తొలగించారు. ఏపీవోల తోపాటు సాంకేతిక సహాయకులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లున్నారు. 2017-2018లో ఉపాధి హామీ పథకం కింద రహదార్లు వేయకుండానే బిల్లులు తీసుకున్నారన్న ఆరోపణలపై సామాజిక తనిఖీ, క్వాలిటీ కంట్రోల్ ద్వారా నివేదికలు అందాయి. ఈ క్రమంలో దుర్వినియోగమైన కోటి 70 లక్షల రూపాయల నిధులను రికవరీ చేయాలని... వారిపై పోలీసు కేసు నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
ఏడుగురు ఉపాధి హామీ సిబ్బంది తొలగింపు - ఉపాధి హామీ
గుంటూరు జిల్లా నూజెండ్ల మండలంలో ఉపాధి హామీ పథకంలో జరిగిన అక్రమాలపై కలెక్టర్ కోన శశిధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడుగురు గ్రామీణ ఉపాధి హామీ సిబ్బందిని విధుల నుంచి తొలగించారు.