ETV Bharat / state

Illegal Sand Mining: పర్మిషన్​ లేదు.. కానీ భారీ యంత్రాలతో తవ్వకాలు.. లక్షల టన్నుల్లో ఇసుక తరలింపు - ఇసుక అక్రమ తవ్వకాలు

Unauthorized Mining in Sand Reaches: రాష్ట్రంలో భారీ యంత్రాలతో ఇసుక తవ్వడానికి వీల్లేదు. కానీ ఇసుక దోపిడీదారుల ఆగడాలు.. మాత్రం ఆగడం లేదు. ఎడాపెడా ఇసుక తవ్వేస్తున్నారు. సెమీ మెకనైజ్డ్‌ విధానంలోనే ఇసుక తవ్వకూడదని సీయా ఆదేశిస్తే.. వాటిని లెక్కచేయకుండా ఏకంగా భారీ యంత్రాలతో ఇసుకను తోడేస్తున్నారు. నదీగర్భాలకు తూట్లు పొడుస్తున్నారు. రోజూ కొన్ని లక్షల టన్నుల ఇసుకను.. వేల ట్రాక్టర్లు, ట్రక్కుల్లో దోచేస్తున్నారు. ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో, అధికారుల అండదండలతో, వైసీపీ నాయకుల ప్రత్యక్ష పర్యవేక్షణలో పగలూ రాత్రీ అన్న తేడా లేకుండా ఇసుక దోపిడీ సాగిపోతోంది. ఇసుక దోపిడీలో ప్రభుత్వ పెద్దలే భాగస్వాములు కాబట్టి.. దొంగ చేతికి తాళాలిచ్చినట్టు దోపిడీ యథేచ్ఛగా జరుగుతోంది.

sand mafia
sand mafia
author img

By

Published : Jul 20, 2023, 9:18 AM IST

పర్మిషన్​ లేదు.. కానీ భారీ యంత్రాలతో తవ్వకాలు.. లక్షల టన్నుల్లో ఇసుక తరలింపు

Unauthorized Mining in Sand Reaches: జాతీయ హరిత ట్రైబ్యునల్‌-NGTఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలోని 110 ఇసుక రీచ్‌లలో సెమీ మెకనైజ్డ్‌ ఇసుక తవ్వకాల్ని వెంటనే నిలిపివేయాలి. మళ్లీ పర్యావరణ అనుమతులు తీసుకోకుండా.. ఆ రీచ్‌లలో ఎలాంటి తవ్వకాలు, నిర్మాణాలు, విస్తరణ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి వీల్లేదు. ఈ జాబితాలో పేర్కొనని రీచ్‌లేమైనా ఉంటే, వాటికి పర్యావరణ అనుమతులు ఉన్నా.. అక్కడా ఇసుక తవ్వడానికి వీల్లేదు. ఈ సంవత్సరం ఏప్రిల్‌ 24న రాష్ట్రస్థాయి పర్యావరణ ప్రభావ మదింపు సంస్థ-సీయా జారీచేసిన ఉత్తర్వులివి. కానీ రాష్ట్రంలో ఇసుకాసురులు ఆడిందే ఆట అన్నట్లు రీచ్‌లలో తవ్వకాలు సాగుతున్నాయి.

రాజ్యాంగబద్ధ సంస్థల ఉత్తర్వుల్ని, కోర్టుల ఆదేశాల్ని ధిక్కరిస్తూ.. రాష్ట్రంలో ప్రభుత్వ పెద్దల అండదండలతో ఇసుక మాఫియా చెలరేగిపోతోంది. కొన్ని దశాబ్దాల క్రితం జార్ఖండ్‌లో బొగ్గు మాఫియా గురించి కథలు కథలుగా చెప్పేవారు. ప్రభుత్వ పెద్దలు, రాజకీయ నాయకులు, అధికారులు కుమ్మక్కై దోపిడీకి దిగితే.. అది ఏ స్థాయిలో ఉంటుందో చెప్పడానికి జార్ఖండ్‌ బొగ్గు మాఫియాను ఉదాహరణగా చెప్పేవారు. ఇప్పుడు దాన్ని తలదన్నే స్థాయిలో రాష్ట్రంలో ఇసుక మాఫియా పేట్రేగిపోతోంది.

చిత్తూరు జిల్లాల్లో సుప్రీంకోర్టు ఆదేశాల్నే ధిక్కరించి, యథేచ్ఛగా ఇసుక దోపిడీ సాగిస్తున్నారు. JPపవర్‌ వెంచర్స్‌ సంస్థను గుత్తేదారుగా చూపించి.. రాష్ట్రంలోని ఇసుకదందా మొత్తాన్ని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వైసీపీ నాయకుడి పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారు. రీచ్‌లకు పర్యావరణ అనుమతులు ఇచ్చినప్పుడే.. ఒక మీటరు లోతు వరకే, అది కూడా సెమీ మెకనైజ్డ్‌ విధానంలో మాత్రమే ఇసుక తవ్వకాలు జరపాలని సీయా షరతు పెడుతోంది. కానీ ప్రస్తుతం ఏ రీచ్‌లోనూ తవ్వకాలకు సీయా అనుమతి లేకపోయినా, 2 ఘనపు మీటర్ల బకెట్‌ సామర్థ్యం గల భారీ పొక్లెయిన్లతో ఇసుక తవ్వేస్తున్నారు.

మూడు, నాలుగు మీటర్ల లోతు వరకూ ఊడ్చేస్తున్నారు. 18 టన్నుల పరిమితి ఉన్న లారీలో 30-35 టన్నుల ఇసుక లోడ్‌ చేస్తున్నారు. నదీ గర్భాల్లో రోడ్లు వేస్తున్నారు. ఎక్కడైనా నీటి పాయలు ఉంటే.. వాటికి తూములు ఏర్పాటు చేసి మరీ వాటిపై నుంచి రోడ్లు వేసేస్తున్నారు. ఇష్టానుసారం ఇసుక తవ్వేసి.. ఎత్తైన కొండల్ని తలపించేలా కుప్పలు వేసి మరీ అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు.

NTR జిల్లా నందిగామ నియోజకవర్గంలో కృష్ణ, మునేరులో ఇసుక తవ్వకాలు యథేచ్చగా జరుగుతున్నాయి. కంచికచర్ల మండలం కేసర వద్ద కృష్ణా నది నుంచి చందర్లపాడు, కంచికచర్ల మండలాల నుంచి క్వారీల్లో ఇసుక భారీగా తీసుకొచ్చి డంపు చేస్తున్నారు. దాదాపు 100 మీటర్ల ఎత్తులో ఇసుక నిల్వ చేస్తున్నారు. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం మున్నంగి రీచ్‌లో నుంచి తెనాలి డివిజన్‌కు ఇసుక సరఫరా అవుతోంది. ఇక్కడ ఇసుక తవ్వకాలతో భారీగా గొయ్యి ఏర్పడింది. ఇసుక రవాణ కోసం దారి వేసుకున్నారు. నదిఒడ్డున కరకట్ట లోపలి వైపు కొండలా ఇసుకను నిల్వచేశారు.

గుంటూరు జిల్లా తాడేపల్లిలోని గుండెమెడ ఇసుకరీచ్‌లో జోరుగా ఇసుక తవ్వకాలు సాగుతున్నాయి. భారీ పొక్లయిన్‌తో తవ్వకాలు జరిపి.. నది ఒడ్డున కొండలా కుప్పు పోశారు. అనుమతుల గడువు ముగిసినా తవ్వకాలు చేయటంపై స్థానికులు, రాజకీయ పార్టీలు ఆందోళన చేసిన పట్టించుకునే నాథుడే లేదు. పైగా పోలీసులు వారిపైనే కేసులు పెట్టారే తప్ప.. తవ్వకాలు మాత్రం ఆపలేకపోయారు. పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం చామర్రు గ్రామం సమీపంలో కృష్ణా నదీ తీరంలో భారీ యంత్రాలతో తవ్వకాలు చేస్తున్నారు. ఇసుక రవాణా కోసం నది లోపలకు కిలోమీటరుకుపైగా బాట వేశారు. ప్రైవేటు సైన్యం పెట్టుకుని అటువైపు ఎవరూ వెళ్లకుండా దోపిడీ చేస్తున్నారు. పల్నాడు జిల్లా అమరావతి సమీపంలోని వైకుంఠపురంలో భారీ యంత్రాలతో తవ్వకాలు సాగిస్తున్నారు. ఇక్కడ కూడా ఇసుక తవ్వకాల కోసం నదీగర్భంలో దారి ఏర్పాటు చేసుకున్నారు.

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గంలో వంశధార నదిలోని ఇసుకను అక్రమార్కుల తోడేస్తున్నారు. నరసన్నపేట మండలం గోపాల్ పెంట, చేనులవలస తోపాటు మరో ఐదు రేవుల నుంచి యథేచ్చగా ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నారు. నదిలోకి రహదారులు నిర్మించి యంత్రాలతో ఇసుక తోడటం వల్ల భారీ గోతులు ఏర్పడ్డాయి. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం చవ్వాకులపేట వద్ద అనుమతులు లేకున్నా.. యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేసి ఇక్కడ నిల్వచేస్తున్నారు. ఈ నిల్వ చేసిన ఇసుకను రాత్రి సమయాల్లో లారీలతో, టిప్పర్లతో అక్రమంగా తరలిస్తున్నారు.

అన్నమయ్య జిల్లా నందలూరు మండలం మందరం వద్ద గడువు తీరినా ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. భారీ యంత్రాలతో ఇసుక తోడి అక్రమంగా రవాణ చేస్తున్నారు. సమీపంలోని ఆడపూర్ వద్ద సైతం అనధికారికంగా తవ్వకాలు జరుగుతున్నాయి. విచ్చలవిడిగా సాగుతున్న ఇసుక తవ్వకాల వల్ల పర్యావరణానికి తీవ్ర హాని జరుగుతోందని, భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయని ఆందోళనలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వానికి వినిపించడంలేదు. ఇసుకాసురుల్ని వెనకేసుకుని రావడమే తమ ప్రధాన బాధ్యత అన్నట్టుగా గనుల శాఖ వ్యవహరిస్తోంది.

ఇసుక, మద్యం అక్రమాల్ని అరికట్టేందుకు ఏర్పాటు చేశామని వైసీపీ ప్రభుత్వం ఘనంగా చెప్పిన స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో ఇసుక రీచ్‌ల వైపే వెళ్లడంలేదు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో ఇసుక తవ్వకాల్ని APMDCకి అప్పగించినప్పుడు.. రాష్ట్రంలో ఏటా 2కోట్ల టన్నుల ఇసుక తవ్వకాలు జరుగుతాయని అంచనా వేశారు. ఆ తర్వాత జేపీ సంస్థను ముందుపెట్టి, ఇసుక దందాను అధికారపార్టీ నాయకుల చేతుల్లోకి తీసుకున్నాక.. అంతకు అనేక రెట్లు ఎక్కువ ఇసుక దోపిడీ సాగుతోంది. ఒక్క రీచ్‌కి కూడా అనుమతి లేకుండా... రాష్ట్రంలో రోజూ కొన్ని లక్షల టన్నుల ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి.

వర్షాకాలంలో నిర్మాణ రంగానికి ఇసుక కొరత లేకుండా చూసేందుకు అన్ని జిల్లాల్లో ఇసుక నిల్వలు పెడుతున్నామని గనులశాఖ సంచాలకుడు వెంకటరెడ్డి తెలిపారు. ఇసుక తవ్వకాలకు సంబంధించి 2013లో ఉన్న నిబంధనలనే ఎన్జీటీ పరిగణనలోకి తీసుకుందని... తర్వాత 2016, 2018లలో కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ ఇసుక తవ్వకాలపై కొత్త మార్గదర్శకాలు ఇచ్చిందని చెప్పారు. రాష్ట్రంలో 110 రీచ్‌లను పునఃసమీక్షించి, సెమీ మెకనైజ్డ్‌ విధానంలో తవ్వకాలకు మళ్లీ అనుమతి ఇవ్వాలని సీయాను కోరతామని తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.