గుంటూరు జిల్లా తెనాలి మండలం సంగం జాగర్లమూడి గ్రామానికి చెందిన ఇద్దరు యువకుల జీవితం.. విషాదాంతమైంది. సంగమేశ్వర ఆలయం వద్ద బకింగ్ హామ్ కెనాల్ లో పడిన ఇద్దరు.. గల్లంతయ్యారు. ఈతకు దిగి ఒకరు కొట్టుకుపోతుండగా.. అతనిని రక్షించే యత్నంలో మరొకరు గల్లంతు అయ్యారు. గంటల తరబడి గ్రామస్తులు వెతికినా ఫలితం లేకుండా పోయింది.
ఇద్దరినీ గ్రామానికి చెందిన అదం పఠాన్ షరీష్... మరో ఇరువురు కలిసి సంగంజాగర్లమూడి గ్రామంలోని కాలువలో ఈతకు దిగారు. షరీఫ్ కు పెద్దగా ఈత రాదు. ఒక్కసారిగా నీటి ఒరవడి పెరగటంతో అతను కొట్టుకుపోయాడు. ఇదే సమయంలో సాయి కుమార్, మరో ముగ్గురితో కలిసి తాను పని చేస్తున్న టెంట్ వాస్ సామాన్లను కాలువ వద్ద శుభ్రం చేస్తున్నాడు. షరీప్ నీటిలో కొట్టుకు పోవడం చూసి సాయికుమార్ కాలువలోకి దూకాడు. అయితే నీటి ప్రవాహానికి అతనూ గల్లంతయ్యాడు.
సమాచారం అందుకున్న ఇరు కుటుంబాల వారు, వారి బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కాలువ వద్దకు వచ్చి తమ వారి కోసం వెతికారు. చీకటి పడటంతో ఫలితం లేక తిరిగి వెళ్లారు. కేసు నమోదు చేసిన పోలీసులకు గాలింపు చర్యలు చేపట్టారు.
ఇదీ చదవండి: