ఇదీ చదవండి :
ఇరువర్గాల మధ్య ఘర్షణ... ఇరువురికి గాయాలు - Street fight between two groups two injured
గుంటూరు జిల్లా మాడుగుల గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇరువర్గాల పరస్పర ఘర్షణతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ గొడవలో ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఇరువర్గాల మధ్య ఘర్షణ... ఇరువురికి గాయాలు
గుంటూరు జిల్లా గురజాల మండలం మాడుగుల గ్రామంలో ఇరువర్గాలు ఘర్షణ పడ్డారు. ఈ గొడవలో ఇద్దరికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలిచారు. క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పుట్టినరోజు వేడుకల్లో తలెత్తిన గొడవతో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారని గురజాల డీఎస్పీ శ్రీహరిబాబు తెలిపారు. ఎటుంటి ఘర్షణ చోటు చేసుకోకుండా డీఎస్పీ శ్రీ హరిబాబు పోలీసు సిబ్బందితో మాడుగుల గ్రామంలో కవాతు నిర్వహించారు. ఇరువర్గాల ఫిర్యాదుల మేరకు గొడవపడిన వారిని అదుపులోకి తీసుకున్నామన్నారు. గ్రామస్తులు సంయమనం పాటించాలని డీఎస్పీ కోరారు.
ఇదీ చదవండి :
గుంటూరు జిల్లా గురజాల మండలం మాడుగుల గ్రామంలో ఇరు వర్గాల మధ్య గొడవలు జరిగాయి. ఈ ఘర్షణలో తెదేపా కార్యకర్తలు ఇద్దరు కు గాయాలయ్యాయి. వారిని గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలిచారు. ప్రాథమిక చికిత్స అనంతరం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఒక పార్టీకి చెందిన పలువురు వచ్చి దాడులకు పాల్పడుతున్న ట్లు బాధితుల బంధువులు చెబుతున్నారు. అనంతరం వారిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చామని తెలియజేశారు. ఈ రోజున ఉదయం గురజాల డి.ఎస్.పి శ్రీ హరి బాబు మరియు వారి సిబ్బంది తో కలిసి మాడుగుల గ్రామంలో ఎటువంటి ఘర్షణ చోటు చేసుకోకుండా కవాతు నిర్వహించారు. గ్రామంలో ప్రశాంత వాతావరణ నెలకొల్పాలని గ్రామ ప్రజలకు డిఎస్పి వివరించారు.
గుంటూరు జిల్లా నుండి సైదాచారి ఈటీవీ న్యూస్ గురజాల.9949449423.