ఓటు హక్కు నమోదుకు రేపటితో గడువు ముగుస్తుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ఆ తర్వాత వచ్చిన దరఖాస్తులు ఎన్నికల అనంతరం పరిశీలించి ఓటర్ల జాబితాలో చేరుస్తామని వివరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గడువు పొడిగించబోమని స్పష్టంచేశారు. ఓటు ఉందో లేదో చూసుకోవాల్సిన బాధ్యత ఓటరుపైనే ఉందన్నారు. అనేక మాధ్యమాల ద్వారా ఓటరు నమోదు, తనిఖీకి పెద్దఎత్తున ప్రచారం చేశామని వెల్లడించారు. ఈ స్థాయిలో ఓట్లు పెరిగేందుకు ప్రజలతో పాటు అన్ని వర్గాల కృషి ఉందని ప్రశంసించారు.
ఆన్‌లైన్‌లో సర్వర్ డౌన్ అయితే ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఓటరు నమోదులో ఏపీ అన్ని రాష్ట్రాలతో సమాన స్థాయిలోనే ఉందన్నారు. రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 3.95 కోట్లకు చేరే అవకాశం ఉందని తెలిపారు. జనవరి 11కు ముందు 20 లక్షల కొత్త ఓట్లు జాబితాలో చేర్చామని.. ఈనెల 25వ తేదీ తర్వాత విడుదల చేయనున్న అనుబంద ఓటర్ల జాబితా తర్వాత మరో 20 లక్షలకుపైగా ఓట్లు పెరిగే అవకాశముందన్నారు.
ఇవీ చదవండి..
ఉపరాష్ట్రపతి పర్యటనపై సీఎస్ సమీక్ష
అల్లూరిగా చెర్రీ.. కుమ్రంభీంగా తారక్!