ETV Bharat / state

రైతుల పోరాటానికి కాంగ్రెస్​ పూర్తి మద్దతు: తులసిరెడ్డి - మందడంలో రైతుల ధర్నా

రాజధాని వ్యవహారంలో సీఎం జగన్​ తీరుపై పీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తోందని విమర్శించారు. రాజధాని రైతులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ధ్వజమెత్తారు.

Thulasir Reddy criticized CM jagan and compared with tuglak

author img

By

Published : Jan 13, 2020, 11:53 AM IST

రైతులకు అండగా ఉంటామన్న తులసిరెడ్డి

జగన్ సీఎం అయితే రాష్ట్రం రావణకాష్టం అవుతుందని ఎన్నికల ముందు తాను చెప్పానని...ఇప్పుడు అదే నిజమైందని పీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి అన్నారు. జగన్ నాయకత్వంలో రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తోందని ధ్వజమెత్తారు. అభివృద్ది వికేంద్రీకరణ కాకుండా పరిపాలన వికేంద్రీకరణ చేయడం దారుణమైన తప్పిదమన్నారు. ఆదివారం మందడం వచ్చిన ఆయన... రైతుల పోరాటానికి పార్టీ తరఫున పూర్తి మద్దతు తెలిపారు. 14వ శతాబ్దంలో మహ్మద్ బిన్ తుగ్లక్ రాజధానులు మార్చి 4 లక్షల మందిని పొట్టన పెట్టుకున్నారని.... జగన్ కూడా అలాగే చేస్తున్నారని ఆరోపించారు. రైతులది ధర్మపోరాటమని... చివరకు కచ్చితంగా ధర్మం, న్యాయమే గెలుస్తుందని అన్నారు.

అక్రమ కేసులు పెట్టారు

కులం, మతం పేరుతో రాజధానిని తరలించేందుకు సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని పీసీసీ ఉపాధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ ఆరోపించారు. రాజధానిలో వందలాది మందిపై పోలీసులు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని అన్నారు. రైతులు ధైర్యంగా ఉండి.. మరికొంత కాలం ఆందోళన కొనసాగించాలని సూచించారు. న్యాయం జరిగే వరకు రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు.

ఇదీ చదవండి:

రాజధానిలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నీలినీడలు

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.