ETV Bharat / state

DSC: ఏపీలో ఉపాధ్యాయ ఖాళీలపై నెలకొన్న గందరగోళం..

author img

By

Published : Apr 30, 2023, 10:16 AM IST

Updated : Apr 30, 2023, 12:25 PM IST

AP DSC: రాష్ట్రంలో ఉపాధ్యాయల పోస్టుల ఖాళీలపై రాష్ట్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కేవలం 717 పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నాయని చెబుతుండగా.. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాత్రం డీఎస్సీ నిర్వహిస్తామంటూ ప్రకటినలిస్తున్నారు. కేంద్రం మాత్రం పీఏబీ నివేదికలో రాష్ట్రంలో 45వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ ఉన్నట్లు వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో ఉపాధ్యాయ ఖాళీలపై గందరగోళం నెలకొంది.

AP teacher vacancies news
ఏపీలో ఉపాధ్యాయ ఖాళీలు న్యూస్

AP DSC: ఉపాధ్యాయ కొలువుల కోసం ఏళ్లు తరబడి ఎదురుచూస్తున్న అభ్యర్థులను రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి ప్రకటనలు గందరగోళానికి గురి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో 45వేల 355 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని.. వీటిని భర్తీ చేయాలంటూ కేంద్ర ప్రాజెక్ట్ ఆమోదిత మండలి వెల్లడించింది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 39 వేల పోస్టులు, సెకండరీ స్థాయిలో 6 వేల 347 ఖాళీలున్నాయని.. వీటిని ప్రాధాన్యతతో భర్తీ చేయాలని పీఏబీ నివేదికలో కేంద్రం వెల్లడించింది.

పీఏబీలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావించినా విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాత్రం దాన్ని కొట్టిపారేశారు. అవి కొవిడ్ మహమ్మారి సమయంలో ఖాళీలని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని ఆయన చెప్పారు. ఇప్పుడు కేంద్రం మళ్లీ అదే సంఖ్యను వెల్లడించింది. అయితే డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేస్తామంటూ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటనలు ఇస్తుండగా.. విద్యాశాఖ మాత్రం కేవలం 717 ఎస్​జీటీ పోస్టులు మాత్రమే ఖాళీ ఉన్నాయంటూ.. కేంద్రానికి నివేదించడంపై ఉపాధ్యాయ అభ్యర్థులు అయోమయానికి గురవుతున్నారు.

సమగ్ర శిక్షా అభియాన్‌ వార్షిక ప్రణాళిక, బడ్జెట్‌ 2023-24కు కేంద్రం ఆమోదం తెలిపింది. మార్చి 22న జరిగిన రాష్ట్ర పీఏబీ సమావేశంలో చేసిన తీర్మానాలను శనివారం విడుదల చేసింది. రాష్ట్రంలో 85.5 శాతం సెకండరీ పాఠశాలల్లోనే ప్రధాన సబ్జెక్టులకు ఉపాధ్యాయులు ఉన్నారని.. 57 మంది విద్యార్థులకు ఒక గణిత ఉపాధ్యాయుడు, 67 మందికి ఒక సామాన్యశాస్త్రం, 72 మందికి ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు చొప్పున ఉన్నారని పేర్కొంది. సెకండరీ స్థాయిలో అన్ని స్కూల్స్​లో అవసరమైన సంఖ్యలో ఉపాధ్యాయులను నియమించాల్సిన అవసరం ఉందని వెల్లడించింది.

ఏకోపాధ్యాయ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల సంఖ్యపెరిగిందని పీఏబీ పేర్కొంది. ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తిలో చాలా వ్యత్యాసం ఉందని, దీన్ని పరిష్కరించేందుకు హేతుబద్ధీకరణ చేయాలని సూచించింది. అకడమిక్‌ కార్యక్రమాలు, పాఠ్యాంశాల రూపకల్పనలను పర్యవేక్షించే రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలిలోనూ ఖాళీలు ఉన్నాయి. 45 అకడమిక్‌ పోస్టులు మంజూరైతే ప్రస్తుతం 25 మందే ఉన్నారు. జిల్లా విద్య, శిక్షణ సంస్థల్లో 325 మంది పని చేయాల్సి ఉండగా.. 262 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం ఉమ్మడి సర్వీసు నిబంధనల కేసు న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉన్నందున.. భర్తీ చేయలేకపోతున్నట్లు పేర్కొంది.

ఒక్క విద్యార్థీ చేరని ప్రాథమిక పాఠశాలల సంఖ్య రాష్ట్రవ్యాప్తంగా పెరిగింది. 2020-21లో 35 స్కూల్స్​లో సున్నా ప్రవేశాలు ఉండగా.. 2022-23కు వచ్చేసరికి ఇది 40 స్కూల్స్​కు పెరిగింది. 2021-22లో 12,851 బడుల్లో 30 కంటే తక్కువ మంది విద్యార్థులు, 3,670 పాఠశాలల్లో 15 మంది లోపు ప్రవేశాలు పొందారు. ఆరో తరగతిలో స్కూల్ మానేసే విద్యార్థుల సంఖ్య కూడా పెరిగింది. 2020-21 నుంచి 2021-22 వరకు చూస్తే 9, 10, 11 క్లాసుల్లో ఆ సంఖ్య భారీగా పెరిగింది. దీన్ని తగ్గించేందుకు సర్కారు నిరంతరం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పీఏబీ సూచించింది. 'యూడైస్‌ ప్లస్‌ ప్రకారం ప్రాథమిక నుంచి మాధ్యమిక విద్యకు వెళ్లే స్టూడెండ్స్ సంఖ్య కడప, అనంతపురం, పశ్చిమగోదావరి, కర్నూలు, కృష్ణా, ప్రకాశం, జిల్లాల్లో తక్కువగా ఉంది. ఈ జిల్లాల్లో 2లక్షల మంది ప్రాథమిక నుంచి మాధ్యమిక విద్యకు వెళ్లకుండా మానేస్తున్నవారు ఉన్నారు. ప్రభుత్వం మాత్రం 10వ తరగతి తర్వాత స్టూడెండ్స్ పాలిటెక్నిక్‌, సర్టిఫికెట్‌ కోర్సులకు వెళ్తున్నారని సమాధానమిచ్చింది.

ఇవీ చదవండి:

Last Updated : Apr 30, 2023, 12:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.