గుంటూరు జిల్లా దాచేపల్లిలో పురపాలిక పరిధిలోని నడికుడి భారతీయ స్టేట్ బ్యాంకులో భారీ చోరీ జరిగింది. దుండగలు... తాళాలు పగలగొట్టి రూ.85 లక్షల రూపాయల నగదు అపహరించారు. ఈ ఘటనపై బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్లూస్ టీం ఘటనా స్థలికి చేరుకుని పరిశీలిస్తున్నారు.
తొలుత రూ. 90లక్షలు చోరీ జరిగినట్టు ప్రచారం జరిగింది. జిల్లా ఎస్పీ విశాల్ గున్నీస్పందించి 85 లక్షలే అపహరణకు గురైనట్టు స్పష్టం చేశారు. మిగిలిన బంగారం మరియు లాకర్స్ భద్రంగా ఉందన్నారు. ఎక్కడ డ్యామేజీ లేదని తెలియజేశారు. దొంగలను పట్టుకునేందుకు ఐదు బృందాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
పోలీసులకు ప్రజలు సహకరించాలని తెలియజేశారు. ఎవరికైనా ఎటువంటి అనుమానం ఉన్నా... అనుమానితులు కనిపించినా 88662 68899కు ఫోన్ చేసి చెప్పాలన్నారు. అలాంటి వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని... తగిన పారితోషకం ఇస్తామని ప్రకటించారు. సీసీ కెమెర వైర్లు కట్ చేసి గ్లౌజులు వాడారని.. ఇది ఆకతాయిలు చేసిన పని కాదని ప్రొఫెషనల్ క్రిమినల్స్ చేసిన పనిగా అభివర్ణించారు.
ఇదీ చదవండి: