ETV Bharat / state

పోలీసుల పహారాలో ప్రశాంతంగా ఆత్మకూరు

తెదేపా పిలుపుతో వార్తలోకెక్కిన ఆత్మకూరు గ్రామం ప్రస్తుతం ప్రశాంతంగా ఉంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గ్రామంలో పహారా కాస్తున్నారు.

author img

By

Published : Sep 14, 2019, 8:22 AM IST

ఆత్మకూరులో పోలీసులు
పోలీసుల పహారాలో ప్రశాంతంగా ఆత్మకూరు

గుంటూరు జిల్లా ఆత్మకూరు గ్రామం ప్రస్తుతం ప్రశాంతంగా ఉంది. గుంటూరులోని శిబిరం నుంచి బాధితులను గ్రామానికి తీసుకెళ్లిన తర్వాత పోలీసులు ఇరు వర్గాల వారితో మాట్లాడారు. ఇకపై గొడవలకు దిగబోమని ప్రమాణం చేయించారు. దాడులు, ప్రతిదాడుల కారణంగా గ్రామంలో ప్రశాంత వాతావరణం చెడిపోవటంతో పాటు ఇరు వర్గాల వారు నష్టపోతారని వారికి స్పష్టం చేశారు. గ్రామంలోకి కొత్తవారిని ఎవరు వచ్చినా తనిఖీ చేసి పంపిస్తున్నారు. మీడియాపై ఆంక్షలు విధించారు. ఎస్సీ కాలనీలో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. ఇపుడిపుడే గ్రామంలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. పిల్లలు పాఠశాలకు వెళ్తున్నారు. అలాగే వ్యవసాయ పనులకు వెళ్లడం ప్రారంభించారు.

ఇదీ చూడండి:

అరాచకాలను ప్రశ్నించినందుకే అక్రమ కేసులు: చంద్రబాబు

Intro:555

Body:888

Conclusion:అక్కడ చదివే వారంతా పేద తరగతికి చెందిన బాలికలు .చదువులోనే కాకుండా గృహ అలంకరణ వస్తువుల తయారీలో నైపుణ్యం పెంచుకుంటున్నారు. అధికారులను పొందుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. వీరి ప్రతిభాపాటవాలను చూడాలంటే కడప జిల్లా కస్తూర్బా గాంధీ బాలికల ఉన్నత పాఠశాలను చూడాల్సిందే .

ఇది కడప జిల్లా అట్లూరు లోని కస్తూర్బా గాంధీ బాలికల ఉన్నత పాఠశాల. జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన బాలికలు 200 మంది విద్యను అభ్యసిస్తున్నారు .బాలికల్లో అక్షరాస్యత శాతం పెంచేందుకు 2012లో ఈ పాఠశాలను సువిశాలమైన స్థలంలో నిర్మించారు. అప్పటి నుంచి చదువులో సత్తా చాటుతూ ఉత్తమ ఫలితాలను సాధిస్తున్నారు. పదవ తరగతిలో వందకు వంద శాతం ఉత్తీర్ణత సాధించడం కాకుండా కొందరు విద్యార్థులు 10 కి 10 gpa పాయింట్లను సాధిస్తూ జిల్లా ఉన్నత అధికారుల మన్ననలను అందుకున్నారు. తీరిక సమయాల్లో పనికిరాని వస్తువులను సేకరించి గృహ అలంకరణ వస్తువులు తయారు చేస్తున్నారు. ఇక్కడ పనిచేసే ఉపాధ్యాయులు బాలికల్లో అంతర్గతంగా ఉన్న సృజనాత్మకతను వెలికితీసి వివిధ రకాల అలంకరణ వస్తువుల తయారీని ప్రోత్సహిస్తున్నారు.

బైట్స్
ప్రణవి విద్యార్థి
లీలావతి
త్రివేణి

ఈ పాఠశాలలో కొందరు విద్యార్థులు ముఖ్యమంత్రి చేతుల మీదుగా 5 లక్షల నగదు బహుమతిని కూడా పొందినట్లు ఉపాధ్యాయురాలు రమాదేవి తెలిపారు.
రమాదేవి ఉపాధ్యాయురాలు

ప్రభుత్వం ఈ పాఠశాలలో ఇంకా కొన్ని సౌకర్యాలు మెరుగుపరిచి తే విద్యార్థులు చదువులోనే కాకుండా గృహ అలంకరణ వస్తువుల తయారీలో పోటీ ప్రపంచంలో మేటిగా నిలిచే అవకాశం ఉంది .
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.