Students protest at Kurnool Medical College: కర్నూలు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో విద్యార్థులు నిరసనకు దిగారు. తమకు న్యాయం దక్కే వరకు నిరసిస్తూనే ఉంటామనే రీతిలో తమ వ్యతిరేకతను విద్యార్థులంతా వ్యక్తపరిచారు. ఇంతకీ కళాశాలలో విద్యనభ్యసించే విద్యార్థులు ఈ విధంగా ఎందుకు నిరసన చేయాల్సొచ్చింది? అసలేం జరిగి ఉంటుంది? దాని పర్యవసానాలేంటి అనేది ఇప్పుడు చూద్దాం.!
కేటగిరీలుగా ఎంబీబీఎస్ సీట్ల విక్రయంపై వైద్య విద్యార్థుల అభ్యంతరం..
కళాశాలకు చెందిన భూమి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో: కర్నూలు జిల్లా ప్రభుత్వ మెడికల్ కళాశాలకు సంబంధించిన స్థలాన్ని కొద్దిమంది ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించుకున్నారు. ఈ ఆవరణలో దుకాణాలను నెలకొల్పేందుకు ఎటువంటి అనుమతులు లేకుండా కేటాయించుకున్నారు. తమ కళాశాలకు చెందిన భూమిని ఈ విధంగా లాక్కోవడాన్ని నిరసించిన మెడికల్ కళాశాల విద్యార్థులు నిరసనకు దిగారు. తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కితీసుకోవాలని వారంతా ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు.
రోడ్డు విస్తరణతో మొదలైన వివాదం: కళాశాల దగ్గర్లోని రోడ్డు విస్తరణ పనుల కోసం మెడికల్ కళాశాల ముందున్న కొన్ని షాపులను తొలగించారు. అయితే ఆ కళాశాలకు సంబంధించిన స్థలాన్ని కేటాయించాలని కర్నూలు మున్సిపల్ అధికారులు కోరడంతో మొదటగా వివాదం చెలరేగింది. దీనికి సంబంధించి కళాశాలకు సంబంధించిన స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు ఏ విధంగా ఇస్తారని, ఇప్పటికే కాలేజీ గ్రౌండ్ లో బయట వ్యక్తులు రావడంతో విద్యార్థినులు కళాశాలకు సరిగ్గా రావడంలేదని అలాంటిది ఇప్పుడు సరాసరి బయట వారికి షాపుల కేటాయింపులు చేస్తే ఈ స్థలంలో అసాంఘిక కార్యకలాపాలు జరిగే అవకాశం లేకపోలేదని విద్యార్థులు వ్యతిరేకించారు. జిల్లా అధికార యంత్రాంగం ఈ వివాదం పై చర్యలు తీసుకోవాలని విద్యార్థులందరూ కోరుతున్నారు.
Medical Students: కేటగిరీలుగా ఎంబీబీఎస్ సీట్ల విక్రయంపై వైద్య విద్యార్థుల అభ్యంతరం..
ఇండియన్స్‌కు ఆన్లైన్ క్లాసులు చెప్పేందుకు నో! ఉక్రెయిన్ ప్రొఫెసర్ల 'రాజకీయం'!!