ETV Bharat / state

ఉద్యోగ జాతర... 1,28,589 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ - village and ward secretaries

రాష్ట్రంలో కొలువుల జాతర మొదలైంది. లక్షకు పైగా ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. కేవలం రెండు నెలల్లోగా ఎంపిక ప్రక్రియను పూర్తి చేయనున్నట్టు ప్రకటించింది. జిల్లా ఎంపిక కమిటీల ద్వారా ఈ నియామకాలు జరగనున్నాయి.

ఉద్యోగాలు
author img

By

Published : Jul 27, 2019, 5:30 AM IST

Updated : Jul 27, 2019, 8:32 AM IST

గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం విడివిడిగా నోటిఫికేషన్లు జారీ చేసింది. అన్ని రకాల విభాగాల్లో కలిపి మొత్తం 1,28,589 పోస్టులను భర్తీ చేయనుంది. గ్రామ సచివాలయాల్లో 13 విభాగాలకు సంబంధించి 95,088 పోస్టులు... వార్డు సచివాలయాల్లో 9 విభాగాలకు సంబంధించి 33,501 పోస్టులు భర్తీ కానున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 11,114 గ్రామ సచివాలయాలు, 3,786 వార్డు సచివాలయాలు ఏర్పాటు కానున్నాయి. గ్రామ సచివాలయాల్లో పంచాయతీ కార్యదర్శి (గ్రేడ్-4), గ్రామ రెవెన్యూ అధికారి(గ్రేడ్-2), ఏఎన్​ఎం(గ్రేడ్-3), పశు సంవర్ధక, మత్స్య, ఉద్యాన, వ్యవసాయ, పట్టు పరిశ్రమ సహాయకుల పోస్టులను స్థానిక అవసరాలకు అనుగుణంగా భర్తీ చేస్తారు. మహిళా పోలీసు, ఇంజనీరింగ్ సహాయకుడు, డిజిటల్ సహాయకుడు, గ్రామ సర్వేయర్, సంక్షేమ విద్యా సహాయకుడు పోస్టులన్నీ గ్రామ సచివాలయాల ఏర్పాటుకు తగినట్లు పూర్తి స్థాయిలో భర్తీ చేయనున్నారు. జిల్లా ఎంపిక కమిటీల ద్వారీ ఈ నియామకాలు జరుగుతాయి. ఇన్​ సర్వీస్ ఉద్యోగులకు 10శాతం మార్కుల వెయిటేజీ ఇస్తారు. ఒప్పంద, పొరుగుసేవల కింద పనిచేస్తూ అదే పోస్టులకు దరఖాస్తు చేసే వారికి ఈ అవకాశం లభిస్తుంది.

వార్డు, గ్రామ సచివాలయాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ శనివారం ఉదయం 11 గంటలకు (ఆన్​లైన్​లో

gramasachivalayam. ap. gov. in, vsws. ap. gov. in, wardsachivalayam. ap. gov. in మూడు ప్రత్యేక వెబ్‌సైట్లు ) ప్రారంభం కానుంది. ఆగస్టు 8 తుది గడువుగా ప్రభుత్వం నిర్ణయించింది. సెప్టెంబర్ మొదటి వారంలో రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇది ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది.సెప్టెంబర్ మూడో వారంలో ఫలితాలు ప్రకటిస్తారు. అదే నెల నాలుగో వారంలో నియామక పత్రాలు అందజేస్తారు.

గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలకు ఎంపికైన వారు అక్టోబర్ 2న విధుల్లోకి చేరతారు. వారికి రెండేళ్ల పాటు ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది. ఈ సమయంలో నెలకు రూ.15వేలు చొప్పున వేతనం చెల్లిస్తారు. ఆ తర్వాత శాశ్వత పేస్కేలు వర్తింపజేస్తారు.

Ludhiana (Punjab), July 26 (ANI): One person died after an explosion occurred in a factory in Punjab's Ludhiana today. The mishappening took place in Mundian Kalan area of Ludhiana. Around ten people go injured in the incident. More details are awaited in this regard.
Last Updated : Jul 27, 2019, 8:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.