ETV Bharat / state

నా అన్నవారు రాక... అక్కున చేర్చుకునేవారు లేక!

ఆ బాలికకు ఐదేళ్ల వయసున్నపుడు ఓ వసతి గృహంలో చేర్చారు ఆమె కుటుంబసభ్యులు. పదేళ్లు గడిచాయి. కానీ వాళ్లు తిరిగిరాలేదు. నా అన్న వారు అసలు ఉన్నారో లేరో బాధితురాలికి తెలియదు. అనాథాశ్రమంలోనే కాలం వెళ్లదీస్తోంది. ఇది గుంటూరు జిల్లా పొన్నూరులో ఉంటున్న ఓ బాలిక దయనీయ స్థితి.

a girl in an orphanage
a girl in an orphanage
author img

By

Published : Sep 26, 2020, 9:09 PM IST

గుంటూరు జిల్లా పొన్నూరులోని ఓ అనాథాశ్రమంలో సంరక్షణ పొందుతోంది 15 ఏళ్ల కుమారి. చెదరని చిరునవ్వుతో కనిపించే ఆ బాలిక గుండెలో చెప్పలేనంత బాధ ఉంది. తల్లిదండ్రుల ఆప్యాయతకు ఆమె నోచుకోలేదు. అసలు వారు ఎవరో తెలియని పరిస్థితి. కుమారికి ఐదేళ్ల వయసున్నప్పుడు... గుంటూరులోని ఓ వసతిగృహంలో చేర్చారు ఆమె అక్క. ఆ తర్వాత ఇటు చూడటం మానేశారు. కొన్నేళ్ల తరువాత దత్తత పేరుతో బాలికను ఓ మహిళ తీసుకెళ్లింది. కానీ అక్కడ పని మనిషిలా చూస్తుండటంతో... అధికారుల సాయంతో పొన్నూరులోని ఆశ్రమంలో చేరింది. ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న కుమారికి... లోకం పట్ల ఇప్పుడిప్పుడే అవగాహన ఏర్పడుతోంది.

బాలికను తల్లిదండ్రుల వద్దకు చేర్చాలని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఆమె చిరునామా రికార్డుల్లో సరిగ్గా నమోదు కాకపోవటంతో ఆమెను ఎలా కుటుంబం చెంతకు చేర్చాలో అన్న మీమాంసలో పడ్డారు అధికారులు. కుమారి నరసరావుపేటకు చెందిన ఓ రిక్షా కార్మికుడు కుమార్తె అని సమాచారం ఉన్నప్పటికీ.. అక్కడ వారెవరూ గుర్తించలేదు. పోనీ ఎవరికైనా దత్తత ఇవ్వాలన్నా... కుమారి అందుకు ఒప్పుకోవటంలేదు.

తల్లిదండ్రులు వస్తే వెళ్తానని.. అంతవరకూ ఇక్కడే సంరక్షణ పొందుతానంటోంది. కుమారిని ఎలాగైనా తల్లిదండ్రుల వద్దకు చేర్చేందుకు కృషి చేస్తామని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పీడీ కృష్ణవేణి వెల్లడించారు. ఆ ప్రయత్నం విఫలమైతే ఆమె సంరక్షణకు ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తామని చెప్పారు. కుమారి తల్లిదండ్రుల వివరాలు తెలిస్తే తమకు తెలియజేయాలని కృష్ణవేణి కోరుతున్నారు.

ఒక్క కుమారి మాత్రమే కాదు... గుంటూరు జిల్లాలో ఇలాంటివారు 101 మంది వరకు ఉన్నారు. ఇన్నాళ్లు శిశు గృహాల్లో, అనాథాశ్రమాల్లో పెరిగిన వారిని తల్లిదండ్రుల వద్దకు చేర్చడం అధికారులకు సవాల్​గా మారుతోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.