గుంటూరు జిల్లా తెనాలిలో వైద్య విద్యార్థి మరణించాడు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. మారిస్ పేటకు చెందిన హర్షవర్ధన్ రెడ్డి అమలాపురంలో ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. సెలవులు కావటంతో ఇటీవల ఇంటికి వచ్చాడు. సమీపంలోని సాగునీటి కాలువలో ఈత కోసం వెళ్లాడు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ప్రమాదవశాత్తు మునిగిపోయాడు. గమనించిన స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు. పెదరావూరు వద్ద మృతదేహం బయటపడింది. కుటుంబానికి పేరు తెస్తాడనుకున్న కుమారుడు... ఇలా మరణించటంతో ఇంటిల్లిపాది తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
ఇదీ చదవండి: చెట్టును ఢీకొన్న బైకు... తండ్రీ కుమారుడు మృతి