అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ రైతులు చేపట్టిన నిరాహారదీక్షలు 180వ రోజుకు చేరాయి. ఉదయం నుంచి చేపట్టిన ఈ దీక్షకు.. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. రాజధాని నిర్మాణానికి 35వేల ఎకరాల భూములు ఇచ్చిన రైతుల త్యాగాలను వైకాపా ప్రభుత్వం అవహేళన చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిరంకుశ ధోరణిని మార్చుకుని అమరావతిని రాజధానిగా ప్రకటించాలని ఆందోళన చేస్తున్నా.. ప్రభుత్వానికి ఏ మాత్రం చలనం లేకపోవడం దారుణమన్నారు. ఉద్యమాన్ని అణిచివేయడానికి అనేక కుట్రలు, కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించకపోతే ఆందోళనను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీచదవండి.